Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఇంట్లో సోదాలు జరుగుతాయి. అందరూ చాలా కంగారు పడతారు. విహారి అందరికీ ధైర్యం చెప్పి ఆఫీస్‌లో జరుగుతున్న రైడ్ దగ్గరకు వెళ్తాడు. అంబిక సుభాష్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. ఇంట్లో, ఆఫీస్‌లో రైడ్ జరుగుతుందని విహారి చాప్టర్ క్లోజ్ అని మనం ఇక రాజ్యం ఏలుతామని అంటుంది. అంబిక, మదన్ కూడా విహారితో ఆఫీస్‌కి వెళ్తారు.

మరోవైపు ప్రకాశ్ లక్ష్మీని కిడ్నాప్ చేసి తాను చాలా అదృష్టవంతుడని డబ్బు తన సొంతం అవుతుందని కలలు కంటాడు. ఇంతలో విహారి ఫ్రెండ్ వచ్చి విహారి ఆఫీస్‌లో ఐటీ దాడులు అవుతున్నాయని చెప్తాడు. ప్రకాశ్ చాలా హ్యాపీగా ఫీలవుతాయి. విహారి జైలు పాలవ్వాలని లక్ష్మీని దుబాయ్ సేటుకి అమ్మేయాలని అనుకుంటాడు. విహారి ఆఫీస్‌లో సోదాలు జరుగుతుంటాయి. విహారి వాళ్లు ఆఫీస్‌కి చేరుకుంటాడు. అన్నీ ఫైల్స్ కాలిపోయావని ఇక విహారి జైలుకి వెళ్తాడని అంబిక, సుభాష్ అనుకుంటారు. ఇక అధికారులు విహారితో ఇన్ని ప్రాజెక్ట్‌లు చేశారు ఒక్క ఫైల్ లేదు అంటే విహారి ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్తే అధికారులు మీరు ఇలాంటి ఆన్సర్ ఇవ్వడం బాలేదని విహారితో అంటారు.

అధికారులు విహారితో ఎలాంటి సాక్ష్యాలు లేవు అంటున్నారు. మీ లాంటి గొప్ప బిజినెస్ మెన్ ఇలాంటి కుంటి సాకులు చెప్పడం మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించేలా ఉందని ఆఫీస్‌లో కేవలం ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే కాలిపోవడం ఏంటి ఒక్క ఫర్నిచర్ కూడా ఏం కాలేదు అని అంటారు. అన్ని మీరే దాచేసుంటారని అవి మర్యాదగా ఇవ్వండి అని లేదంటే మీ పరువు పోతుందని అధికారులు విహారితో అంటారు. విహారి మాత్రం తాను చెప్పేది నిజమే అంటాడు. ఇక అంబిక ప్రాజెక్ట్ ఇస్తానని మోసం చేసిన వాళ్లకి కూడా విషయం తెలిసి ఆఫైల్స్ ఉంటేనే అంబికను దోషిగా నిలబెట్టేవాళ్లం కానీ ఇప్పుడు ఆ ఫైల్స్ లేకపోవడం వల్ల అంబిక ఫ్రాడ్ బయట పెట్టలేమని దామోదర్ అనుకుంటాడు. దామోదర్ సుభాష్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇక అంబికకు కాల్ చేస్తాడు. అంబిక దామోదర్‌తో విహారి దగ్గర నన్ను బుక్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఫైల్స్ లేవు ఫైల్స్‌లో లెక్కలు లేవు ఇప్పుడు నువ్వు కూడా విహారితో పాటు జైలుకి వెళ్తావని బెదిరిస్తుంది.

విహారి ఇంటి దగ్గర నగలు, డబ్బులు అన్నీ లెక్కలు చూస్తుంటారు. పద్మాక్షి యమునను ఉద్దేశించి తిడుతుంది. మరోవైపు లక్ష్మీని ప్రకాశ్ ఓ గదిలో బంధించి ఉంటాడు. లక్ష్మీకి మెలకువ వచ్చి చూస్తుంది. చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు తనని ఓ కుర్చీకి కట్టేసి ఉంటారు. ఇక టీవీలో విహారి కంపెనీల మీద ఐటీ దాడులు అని సరైన లెక్కలు చూపించలేకపోయాడని విహారికి జైలు శిక్ష పడుతుందని చూపిస్తారు. యమునతో పాటు ఇంట్లో వాళ్లు ఏడుస్తారు. లక్ష్మీ కూడా న్యూస్ చూస్తుంది. ఎలా అయినా తప్పించుకోవాలని అనుకుంటుంది. సహస్ర కూడా ఏడుస్తుంది. బావకి ఇలా అవుతుందేంటి అని తల్లికి చెప్పుకొని ఏడుస్తుంది. మన రెండు కుటుంబాలు కలవడం జరగదు అని అంటుంది. నా వల్ల నీకు ఏం సంతోషం లేదమ్మా అని చంపేయమని తల్లి చేతులతో తనని కొట్టించుకుంటుంది. వసుధ సహస్ర మీద అరిచి ఓదార్చుతుంది. లక్ష్మీ ఎలా అయినా తప్పించుకోవాలని దగ్గర్లో ఓ చాకు చూసి మెల్లగా వెళ్లి చాకు అందుకుంటుంది. చాకుతో తన చేతులకు ఉన్న తాడు కట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!