Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode

విహారి సహస్రతో హనీమూన్‌కి అమెరికా బయల్దేరుతూ పండు, చారుకేశవలకు లక్ష్మీ బాధ్యత అప్పగిస్తాడు. లక్ష్మీని కనుసైగతో వెళ్తానని చెప్తాడు. అందరూ దగ్గరుండి విహారి, సహస్రలను కారెక్కిస్తారు. అంబిక ఇక తనకు తిరుగే లేదని అనుకుంటుంది.

యమున గదిలోకి వెళ్లి విహారి సంతకం చేసిన విడాకుల పేపర్లు చూస్తూ ఉంటుంది. ఇంతలో వసుధ లక్ష్మీని తీసుకొని యమున దగ్గరకు వస్తుంది. వదినా అని వసుధ పిలవగానే యమున పేపర్ వెనక దాచేస్తుంది. వసుధ కోపంగా ఏంటి వదిన ఏదో వెనక దాచేస్తున్నారని అడుగుతుంది. ఏం లేదని యమున చెప్పగానే యమున చేతిలో పేపర్ వసుధ తీసుకుంటుంది. ఇవేంటో నాకు తెలుసు వదిన అని అంటుంది. యమున షాక్ అయిపోతుంది. లక్ష్మీ కంగారుగా డోర్ వేసేస్తుంది.

వసుధ: ఎందుకు డోర్ వేసేస్తున్నావ్ ఎవరికీ మా మాటలు వినిపించకూడదు అనా ఇంత మంచిదానివేంటి లక్ష్మీ నువ్వు. వదిన అసలు నువ్వు నువ్వేనా.. వదినా లక్ష్మీకి విహారికి పెళ్లి అయింది అని నాకు తెలుసు. మీ కొడుకు దగ్గరే వాడికి తెలీకుండా విడాకుల సంతకాలు తీయించుకొని ఇద్దరికీ విడదీయాలని ఎలా అనుకుంటున్నారు. లక్ష్మీ ఉసురు తగలడానికి వీల్లేదు వదినా. అని విడాకుల పేపర్ చింపేస్తుంది.
యమున: వసుధ ఏం చేస్తున్నావ్ వసుధ అలా చేయకు వసుధ.
వసుధ: అన్యాయాన్ని సరిదిద్దుతున్నా.
యమున: సరే అన్యాయాన్ని సరిదిద్దుతున్నా అన్నావ్ తనకు న్యాయం చేయగలవా ఎలా చేస్తావ్. ఇక్కడ విడివిడిగా ఉండే ఒక్కొక్కరి జీవితాల కంటే కుటుంబం ముఖ్యం.
వసుధ: అంటే మన కుటుంబం కోసం లక్ష్మీకి అన్యాయం చేస్తామా.
యమున: మరేం చేస్తాం.
వసుధ: అయ్యో వదిన ఆ దేవుడికే ఆ సమాధానం తెలీక ఇన్ని చిక్కు ముడులు వేశాడు. కాలమే సమాధానం చెప్తుంది వదిన.
యమున: అప్పటి వరకు ఇంట్లో ఈ నిజం దాచి ప్రళయం సృష్టిస్తామా.
వసుధ: ఆ కాలం ఏం నిర్ణయం చేస్తే అది జరగని వదిన. అప్పటి వరకు తనకు అన్యాయం చేయొద్దు వదిన తను నా కూతురు లాంటి నేను వేడుకుంటున్నా నా కూతురిని అన్యాయం చేయొద్దు వదినా. తన బంధాన్ని విడదీయొద్దు. ఆ పని మనం చేస్తే అందరం ఉండి కూడా తను అనాథలా మారిపోతుంది వదినా.

లక్ష్మీ ఏడుస్తుంది. యమున కూడా ఏడుస్తుంది. సహస్ర చాలా హ్యాపీగా ఉంటుంది. విహారి లక్ష్మీని తలచుకొని బాధ పడుతుంటాడు. లక్ష్మీ ఏడుస్తుంటే ప్రకాశ్ లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. విహారి ఉంటేనే నేను భయపడేది విహారి లేడు నన్ను ఎవరూ ఆపలేరు అని అనుకుంటాడు. లక్ష్మీతో ఏంటి కనకం ఏడుస్తున్నావా.. అయ్యో పాపం అయ్యో పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని అంటాడు. నా కన్నీళ్లకి కష్టాలకు కారణం నువ్వేరా అని లక్ష్మీ ప్రకాశ్‌ని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ప్రకాశ్ లక్ష్మీని పట్టుకొని ఏంటి కనకం చేయి లేస్తుంది. విహారికి మాత్రమే నేను భయపడేది ఇప్పుడు విహారి లేడు నిన్ను ఎవరూ కాపాడలేరు అని అంటాడు. విహారి ఎంత పిచ్చోడు కనకం ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఇలా అయిపోతున్నాడు. వాడో సెంటిమెంటల్‌ ఫూల్ వాడి ప్లేస్‌లో నేను ఉంటేనా అని లక్ష్మీ చేయి మడప పెట్టేసి లక్ష్మీని పట్టుకొని ఇబ్బంది పెడుతుంటాడు. అటుగా వెళ్లిన యమున చూసి ప్రకాశ్ అని అరుస్తుంది.

ప్రకాశ్‌ని లాగిపెట్టి కొడుతుంది. నిన్ను ఇలా కాదురా ఎంత ధైర్యంరా అని చితక్కొడుతుంది. లక్ష్మీ నా భార్య అని ప్రకాశ్ అంటే ఏంటి నీ భార్యనా ఎవరైనా సరే ఆడపిల్ల మీద చేయి వేస్తే నేను ఊరుకోను అని వాడిని పంపేస్తుంది. లక్ష్మీ యమునని హగ్ చేసుకొని ఏడుస్తుంది. యమున కూడా ఏడుస్తుంది. యమున లక్ష్మీతో లక్ష్మీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు ఏం చేయాలో తెలీక అలా చేస్తున్నా.. నువ్వు ఎప్పటికీ నా మనిషివే అంతా చల్లగా జరిగితే ప్రకాశ్ బారి నుంచి నిన్ను విడిపించి నీకు మంచి జీవితం ఇస్తాను అంటుంది.

ప్రకాశ్ కిందకి వెళ్తూ వామ్మో ఆంటీ ఏంటి అలా కొట్టారు. జస్ట్ మిస్ పోయే వాడిని అని అనుకుంటాడు. పద్మాక్షి లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీ, ప్రకాశ్‌లతో మీ ఇద్దరికీ ఒక గుడ్ న్యూస్ అని అంటుంది. గండిపేటలో మా గెస్ట్ హౌస్‌ క్లీన్ చేయిస్తున్నా మీ ఇద్దరికీ అది ఇచ్చేస్తున్నా.. ఇక నుంచి మీరు అక్కడే ఉండొచ్చు అని అంటుంది. అందరితో ఇన్ని రోజులు తన భర్త ఎవరో తెలీదు కాబట్టి మనతో ఉండేది ఇప్పుడు తన భర్త వచ్చాడు కదా వాళ్లు వాళ్ల జీవితం చూసుకుంటారని అంటుంది. యమున కూడా వద్దని కొన్ని రోజుల తర్వాత పంపిద్దామని అంటుంది. నాకు ఎవరూ ఏం చెప్పొద్దు అని పద్మాక్షి చెప్పి ఎల్లుండి నీ భార్యని తీసుకొని వెళ్లిపో ప్రకాశ్ అని అంటుంది. యమున మనసులో ఈ దుర్మార్గుడితో లక్ష్మీ వెళ్లకుండా ఎలా అయినా ఆపాలి అనుకుంటుంది. ఇక సహస్ర వెబ్ చెక్ ఇన్ చేయాలని చూస్తుంటుంది. తన పాస్పోర్ట్ చెక్ చేస్తుంది. విహారిది చూసి నీ వీసా లేదు ఏంటి బావ అని అడుగుతుంది. కోపంగా డ్రైవర్‌తో కారు ఇంటికి తీసుకెళ్లు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.