kalavari kodalu kanaka Mahalakshmi serial today episode చారుకేశవ విహారిని తీసుకొని ఆఫీస్‌కి వస్తాడు. ఆఫీస్‌లో పరిస్థితి బాలేదురా.. లక్ష్మీ ఉండుంటే ఇంత టెన్షన్ పడుండే వాడిని కాదు అని చారుకేశవ అంటే లక్ష్మీ పేరు ఎత్తొద్దు నన్ను మోసం చేసింది అని తిడతాడు. ఇక బామ్మ లక్ష్మీ గురించి ఎవరూ ఏం చెప్పడం లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి సిరి కండీషన్ సీరియస్‌గానే ఉంది.. తను మేలుకుంటే తప్ప ఏం చెప్పలేమని అంటుంది. బామ్మ చాలా టెన్షన్ పడుతుంది.

సహస్ర, పద్మాక్షి కూడా అదే హాస్పిటల్‌కి వస్తారు. పద్మాక్షి, సహస్ర ఇద్దరూ డాక్టర్‌ని కలుస్తారు. మన లెక్క ప్రకారం ఇప్పుడు నా కూతురికి తొమ్మిదో నెల. ఇంట్లో అందరికీ చెప్పడానికి ఓ డెలివరీ డేట్ కావాలని అడుగుతారు. మీకు ఇవ్వాల్సిన బేబీకి వాళ్లు మరో పది లక్షలు ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు అని డాక్టర్ చెప్తుంది. పద్మాక్షి సరే అని చెప్తుంది. ఆ అమ్మాయికి స్కాన్ చేసి మీకు డెలివరీ డేట్ చెప్తానని డాక్టర్ అంటుంది. ఇక సహస్ర, పద్మాక్షి రిటర్న్ అయిపోతారు. భుజంగం తన మనిషికి కాల్ చేసి ఇంకా అక్కడే ఉన్నావా లక్ష్మీని చంపి నాకు కాల్ చేయ్ అని అంటాడు.

విహారి ఆఫీస్‌లో బోర్డు మీటింగ్ మొదలవుతుంది. అంబిక వచ్చి ఈ మీటింగ్ మన కంపెనీల గ్రోత్ గురించి అని మాట్లాడుతూ ఉంటుంది. అందుకు సంబంధించి ప్రజంటేషన్ ఇస్తుంది. విహారి మాత్రం ఏం పట్టనట్లు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఎవరికి ఏమైనా అభ్యంతరం ఉందా అని అంబిక అడిగితే విహారి చేయి ఎత్తుతాడు. మీ ప్లాన్స్ అన్నీ బాగున్నాయ్ కానీ 30 పర్సెంటేజ్ లాభాలు యూజ్ లెస్.. గతేడాదే మేం 40 శాతం దక్కించుకున్నాం.. ఇప్పుడు ఒక 50 శాతం అయినా చెప్పాలి అని అంటాడు. మత్తులో ఉన్నాడనుకుంటే బాగానే చెప్తున్నాడు అనుకుంటుంది. విహారి ఛైర్మన్‌గానే ఉన్నాడు.. కానీ 6 నెలలుగా సీఈఓ పదవి ఖాళీగా ఉంది.. అని అంటుంది. లక్ష్మీ ఉన్నప్పుడు నుంచి మనకు చాలా నష్టాలు వచ్చాయి. లక్ష్మీ గురించి మీకు తెలీదు..ఇంట్లో పని చేసుకునే అమ్మాయి ఆఫీస్‌లో సీఈఓ పదవి దక్కించుకుందంటే మాకు అర్థం కావడం లేదా అని అంబిక మనుషులు అందరూ లక్ష్మీ గురించి తప్పుగా మాట్లాడి విహారిని రెచ్చగొడతాడు. లక్ష్మీకి విహారికి ఏదో ఎఫైర్ ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నారని అంటారు. విహారి కోపంతో ఒక మనిషిని కొట్టబోయి బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరి తల పగల గొట్టేస్తాడు.

బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అందరూ విహారి మీద విరుచుకుపడతారు. విహారి సారీ చెప్పకపోతే విహారిని ఛైర్మన్‌గా దింపేస్తామని అంటారు. అంబిక వాళ్లని బతిమాలినట్లు నటిస్తుంది. మరోవైపు లక్ష్మీకి మెలకువ వస్తుంది. బామ్మకి విషయం చెప్పడంతో చాలా సంతోషపడుతుంది. ఇక సహస్ర, పద్మాక్షి అటుగా వస్తుంటారు. పద్మాక్షి లక్ష్మీని చూస్తుంది. ఏంటి అక్కడే ఆగిపోయావ్ అని సహస్ర పద్మాక్షిని అడిగితే నువ్వు కారు తీస్తుండు నేను డాక్టర్‌తో మాట్లాడి వస్తా అని అంటుంది. సహస్ర వెళ్లగానే ఓసేయ్ లక్ష్మీ నువ్వు ఇక్కడున్నావా,.., ఇన్ని రోజులు నీ శని మాకు లేదని అనుకున్నాం.. నువ్వు ఈ సిటీలో ఉంటే నాలుగు రోజుల తర్వాత ఇంటికి వస్తావ్.. నువ్వు ఇక ఎప్పటికీ రా కూడదు అంటే నిన్ను ఇక్కడే చంపేయాలి అని కత్తి పట్టుకొని లోపలికి వెళ్తుంది. ఇంతలో లక్ష్మీ కడుపు చూసి ఆగిపోతుంది. గతంలో చేసిన సరోగసి వర్కౌట్ అయిందేమో అని అనుకుంటుంది. నర్సుని అడిగి ఏమైందని అడుగుతుంది. విష ఆహారం తినడంతో ఇలా అయింది అని ఇప్పుడు లక్ష్మీకి ఏడో నెల అని తెలుసుకుంటుంది. తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లి 7 నెలలో డెలివరీ చేయొచ్చా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.