Also Kakinada Port News: కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో సంచలనం సృష్టించిన స్టెల్లా ఎల్‌ షిప్‌ ముందుకు కదల్లేకపోతోంది. ఇందులో 2,384 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించామని చెప్పినా చర్యలకు ముందుకు సాగడం లేదు. వాటిని స్వాధీనం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ చేసిన ప్రయత్నాలు ఫలిచంలేదు. వీటన్నింటికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, కురుస్తున్న వర్షాలు అన్నింటికీ ఆంటంకంగా మారాయి.

పీడీఎస్‌ బియ్యం చుట్టూ వివాదం..
పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు మారిందన్న విమర్శలు కాకాపుట్టించాయి. ఇక్కిడ నుంచే విదేశాలకు బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వివాదంపై జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సినీఫక్కీలో తనిఖీలు చేశారు. ఆ తరువాత ఏపీ డీప్యూటీ సీఎం కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అది వీలు కాకపోవడంతో సీజ్‌ద షిప్‌ అంటూ చేసిన వ్యాఖ్యలు నేటికీ మారుమోగుతున్నాయి.

Also Read: కోస్తాజిల్లాల్లో గ్రామాల్లో నివురుగప్పిన నిప్పులా పాత కక్షలు-పెరిగిపోతున్న హత్యోదంతాలు

ఈ వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారినా షిప్‌ సీజ్‌ చేయడం మాత్రం కుదర్లేదు. అందులోఉన్న 2, 384 టన్నుల అక్రమ బియ్యం నిల్వలను స్వాధీనం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా ఆదేశాలతో బియ్యం బస్తాలు దించే ప్రక్రియ మొదలు పెట్టిన కాసేపటికే వర్షాలు అడ్డుకున్నాయి.

ఆగిపోయిన అన్ లోడింగ్‌..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీనికి తోడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం లంగరు రేవులోని బార్జిలో ఉన్నటువంటి 1,064 టన్నుల బియ్యం ఒడ్డుకు చేర్చి ఆపై గోదాములకు తరలించి సీజ్‌ చేయాలని అనుకున్నారు. కస్టమ్స్‌ అనుమతి లభించడంతో సివిల్‌ సప్లై, పోర్టు, కస్టమ్స్‌, రెవెన్యూ అధికారుల బృందం సమక్షంలో బార్జిలోని బియ్యం నిల్వలు తీసి గోడౌన్‌లో భద్రపరుస్తుండగా ఎక్కడిక్కడే పనులు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి స్టెల్లా షిప్‌లో ఉన్న బియ్యం నిల్వలను అన్ లోడింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

శుక్రవారం కూడా ఇదే పరిస్థితి...
సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితుల్లో తీరం నుంచి తొమ్మిది నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న స్టెల్లా ఎల్‌ షిప్‌ వద్దకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. శుక్రవారం కూడా సముద్రం మరింత అల్లకల్లోలంగా మారడంతో మళఅలీ వాయిదా పడింది. తీరం నుంచి తొమ్మిది నాటికన్‌ మైళ్ల దూరంలో ఉన్న స్టెల్లా ఎల్‌ నౌకలో 1320 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉండగా యాంకరేజ్‌ పోర్టులో ఉన్న బార్జ్‌లో ఇంకా కొంత పీడీఎస్‌ రేషన్‌ బియ్యం నిల్వలు ఉండిపోయాయి.

Also Read: నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లు.. 14 మంది మత్స్యకారులను ఎలా రక్షించారంటే..