Dulquer Salmaan Kaantha OTT Streaming : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ రీసెంట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

5 భాషల్లో స్ట్రీమింగ్

ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో గురువారం అర్ధరాత్రి నుంచి 'కాంత' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ మూవీకి దర్శకత్వం వహించగా... భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు రానా దగ్గుబాటి, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.

Also Read : బాలయ్య 'అఖండ 2' సెలబ్రేషన్స్ - థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తాండవం... వీడియోలు వైరల్