తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన ప్రముఖ తమిళ నటుడు, దర్శక రచయిత కె. భాగ్యరాజ్ (K Bhagyaraj) ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన కన్ను మూశారు.

గుండెపోటుతో భాగ్యరాజ్ మృతి
K Bhagyaraj Death Reason: ఈ రోజు (జూన్ 27న) ఉదయం చెన్నైలో గుండె పోటుతో కె భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమారు 75 చిత్రాల్లో నటించారు.

'సువరిల్లాద చిత్రంగల్' (1979)తో కె భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'మౌన గీతంగల్', 'అంద 7 నాట్కల్', 'ముందానై ముడిచ్చు', 'చిన్న వీడు' వంటి మధురమైన, మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తన విలక్షణమైన రచనా శైలి, ముఖ్యంగా హాస్యంతో పాటు కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలను కథలో మేళవించి సినిమాలు తీయడంలో కె భాగ్యరాజ్ స్పెషలిస్ట్. ఇటీవల తమిళ చిత్రసీమలో మరో సీనియర్ దర్శకుడు భారతీరాజా మరణించారు. రెండు వారాల్లో మరో విషాదం చోటు చేసుకుంది.

Also Read: Actress Krishi Thapanda - బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

😢💔 Tamil cinema mourns again...
RIP K. Bhagyaraj Sir. 🙏🏼
Your classics - Mundhanai Mudichu, Thooral Ninnu Pochu, Andha 7 Natkal - touched millions with laughter, love & life lessons.
Just 2 weeks after your guru Bharathiraja Sir left us, you too are gone.
The pain is too… pic.twitter.com/4V6RWJkcLo

— Selva (@selvaredbot5) June 27, 2026

కె భాగ్యరాజ్ కుటుంబం విషయానికి వస్తే... ఆయనకు భార్య పూర్ణిమ, పిల్లలు శరణ్య, శాంతను ఉన్నారు. నటుడిగా, కథానాయకుడిగా కుమారుడు శాంతను భాగ్యరాజ్ సినిమాలు చేస్తున్నారు. దళపతి విజయ్ 'మాస్టర్' సినిమాలో స్టూడెంట్ రోల్ చేశారు. హీరోగానూ సినిమాలు చేశారు. సోనీ లివ్ ఓటీటీలోని 'స్టోరీ ఆఫ్ థింగ్స్', 'పావై కదగల్'... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోని 'ఎంవై 3' చేశారు. తండ్రి దర్శకత్వం వహించిన వెట్టియా మడిచ్చు కట్టు'లో బాలనటుడిగా చేసిన శాంతను భాగ్యరాజ్... 'సక్కరకట్టి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Also Read: Puri Jagannadh Charmy Kaur - ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు

Deeply saddened to hear of the passing of legendary filmmaker K. Bhagyaraj. His extraordinary contribution to Indian cinema through timeless storytelling, unforgettable performances, and inspiring direction will always be remembered. His legacy will continue to influence… pic.twitter.com/ptQola4SLY

— Balaji (@Balaji5168) June 27, 2026