Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

1 month ago 5
ARTICLE AD

వీపనగండ్ల: రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ (ప్యాకేజీ-16) ప్రధాన కాలువ తెగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి శనివారం నాడు వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో కాలువకు ఏర్పడిన గండిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారుల తీరును తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.

రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సుమారు 76.825 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా దాదాపు 16,666 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అధికారులు కాగితాల్లో చూపుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. కానీ, వాస్తవానికి 62.25 కిలోమీటర్ల వద్ద 2019, జూలై 23న కాలువ తెగిపోయిందని, అప్పటి నుంచి నేటి వరకు మరమ్మతులు చేయకుండా సాగునీరు అందుతున్నట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపడమేమిటని అధికారులను నిలదీశారు. కాలువ తెగిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పనులను ఈపీసీ (EPC) ఒప్పందం కింద చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య కుదిరిన ఒప్పందం ఇంకా ముగియలేదని, పనులు కూడా అధికారికంగా పూర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల కాలువ మరమ్మతులు సహా మిగిలిన పనులన్నింటికీ కాంట్రాక్టరుదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పారు. తక్షణమే కాలువ గండిని పూడ్చి, మిగిలిన కాలువలు, మైనర్లు, సబ్ మైనర్ పనులను పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

Read Entire Article