Jubilee Hills Byelections: జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మందిని బైండోవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సూచనల మేరకు పోలీసులు ఎన్నికల సమయంలో శాంతి, భద్రతా పరంపరలు కాపాడేందుకు పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై కఠిన నిఘా ఉంచుతున్నారు. ఏదైనా కేసు నమోదైతే, వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇది ఎన్నికల ప్రక్రియను భద్రంగా నిర్వహించేందుకు తీసుకున్న జాగ్రత్త చర్యలో భాగం.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం రౌడీషీటర్లు 100 మందికిపైగానే ఉన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ 19 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన సోదరుడు రమేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి కదలికలపై పూర్తి నిఘా ఉంచామని అని పోలీసు అధికారులు తెలిపారు.