Jubilee Hills by Elections 2025 | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థపై ఉత్కంఠ వీడింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం దీపక్ రెడ్డి పేరు బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. గోపినాథ్ ఆకస్మిక మృతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మాగంటి సునీత నామినేషన్..

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంగి సునీత నామినేషన్ దాఖలు చేశారు. గురువారం షేక్ పేట తహసీల్దార్ ఆఫీస్ లో మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట జగదీష్ రెడ్డి, కేటీఆర్, తలసానితో సహా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వెళ్లారు.