Shubh Muhurat For Joining New Job: ఆఫీసులో వేసే మొదటి అడుగు కేవలం ఫార్మాలిటీ కాదు. భవిష్యత్తుకు మార్గం ఈ క్షణం నుంచే మొదలవుతుంది. నేటి కార్పొరేట్ యుగంలో, ప్రజలు ఉద్యోగం మారడాన్ని జీవితంలో అదో కొత్త ఒప్పందంగా భావిస్తారు. అందుకే తొలి అడుగు మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకుని వేస్తారు.

రాశి ,నక్షత్రం ప్రకారం మంచి రోజు చూసుకుని నూతన ఉద్యోగంలో చేరితే మంచి ఫలితం దక్కుతుందని, కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని, ప్రమోషన్ వస్తుందని చాలామంది నమ్మకం.

ఉద్యోగంలో చేరే రోజు మంచి ముహూర్తం లేకపోతే..రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుందని, ప్రతి అడుగులోనూ సమస్యలు ఎదురవుతాయని , బాస్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయని కొందరి భయం..

శాస్త్రాలు, ముహూర్తాలు పట్టించుకోనివారి సంగతి సరే..వీటిని పరిగణలోకి తీసుకునే వారు శుభముహూర్తం చూసుకుంటారు..

శుభ ముహూర్తం ఎందుకు ముఖ్యం?

ముహూర్త చింతామణి ప్రకారం విదియ, పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశి కార్యారంభే శుభాః...అంటే ఉద్యోగంలో కానీ ఏదైనా పెద్ద పనిని కానీ ఈ రోజు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది.

ముహూర్త చింతామణి ప్రకారం.. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం స్థిరత్వం విజయాన్ని తీసుకొస్తాయి. రోహిణి, హస్త, అనూరాధ, రేవతి నక్షత్రాలలో ప్రారంభించిన పని చాలా కాలం పాటు కొనసాగుతుంది. అదేవిధంగా అభిజిత్ ముహూర్తం ప్రతి పనిని శాశ్వతం చేసే సమయం.

ఏ రోజుల్లో చేరొద్దు

మంగళవారం, శనివారం శుభప్రదంగా పరిగణించరు. ఈ రోజున పనిని ప్రారంభిస్తే, కార్యాలయంలో వివాదాలు ,అడ్డంకులు ఎదురవుతాయి. అదేవిధంగా.. అష్టమి, చతుర్దశి, అమావాస్య తేదీలు ఉద్యోగంలో ఒత్తిడి అడ్డంకులను కలిగిస్తాయి. రాహుకాలం, యమగండం ఉన్న సమయంలో ఉద్యోగంలో చేరడం మంచిది కాదు. ఈ సమయాల్లో నూతన ఉద్యోగంలో చేరినా, కొత్త పని ప్రారంభించినా కష్టాలు తప్పవు.

కార్పొరేట్ నిపుణుల కోసం ప్రత్యేక సూచనలు

సోమవారం , గురువారం ఉద్యోగంలో చేరేవారు రెగ్యులర్ గాబాస్ నుంచి మద్దతు పొందుతారు..పదోన్నతి త్వరగా లభిస్తుంది. బుధవారం , శుక్రవారం ప్రవేశించే వ్యక్తులు టీమ్‌వర్క్ నెట్‌వర్కింగ్‌లో బలంగా ఉంటారు. మంగళవారం, శనివారం నూతన ఉద్యోగంలో చేరేవారు కష్టానికి తగిన ఫలితం పొందలేరని, తగిన గుర్తింపు లభించదని, ఏదో ఒక సమస్యలలో చిక్కుకుంటారని ముహూర్త చింతామణిలో ఉంది.

మొదటి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి

ఉద్యోగంలో చేరే మొదటి రోజు నీలం రంగు దుస్తులు ధరించండి. కార్యాలయంలోకి ప్రవేశించేముందు ఓం గం గణపతయే నమః జపించండి. కొత్త పెన్ లేదా డైరీని తీసుకెళ్లడం ప్రారంభానికి చిహ్నం.

కార్పొరేట్ రంగంలో విజయం నైపుణ్యాలు, కష్టానికి సంబంధించినది కాదు. సరైన ప్రారంభమే సరైన గమ్యానికి చేరుస్తుందని శాస్త్రాలు నమ్ముతాయి. చేరే రోజు, నక్షత్రం ,ముహూర్తం అనుకూలంగా ఉంటే, కెరీర్‌లోని ప్రతి గమ్యం సులభం అవుతుంది.

ప్ర. నిజంగానే చేరే రోజు కెరీర్‌పై ప్రభావం చూపుతుందా?
అవును, ముహూర్త చింతామణిలో కార్యారంభం ప్రాముఖ్యత స్పష్టంగా ఉంది

ప్ర. ఉత్తమ రోజులు ఏవి?
గురువారం , శుక్రవారం, ముఖ్యంగా దశమి మరియు ద్వితీయ తేదీల్లో.

ప్ర. ఏ రోజులను నివారించాలి?
మంగళవారం, శనివారం .. రాహుకాలం/యమగండం సమయం.

ప్ర. కార్పొరేట్‌లో కూడా పూజలు ఎందుకు?
ఎందుకంటే ఇది మనోబలాన్ని పెంచుతుంది, సానుకూల శక్తితో ప్రారంభమవుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎలాంటి నమ్మకాన్ని లేదా సమాచారాన్ని ధృవీకరించడంలేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.