Jogi Ramesh chat with liquor case accused Janardhan Rao leaked: ఏపీలో కలకలం రేపుతున్న నకిలీ లిక్కర్ స్కాంలో ఏ 1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు .. మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే చేశానని వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆయన జోగి రమేష్ తో జరపిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. జనార్దన్ రాను జోగి రమేష్ తన ఇంటికి రమ్మని పిలవడంతో పాటు.. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని ఆ వాట్సాప్ చాట్‌లో ఉంది. జోగి రమేష్ మొదటగా అసలు జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని తనపై కుట్ర చేస్తున్నరని ఆరోపణలు చేశారు. తర్వాత తనకు పరిచయం ఉంది కానీ స్నేహితుడు కాదని తెలిపారు. జనార్దన్ రావు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని అంటున్నారు. మరో వైపు జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. సీసీ ఫుటేజీలు సేకరిస్తున్నారు పోలీసులు.