రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో ఆదివారం (నవంబర్ 2) న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్వా కూడా సంతాపం తెలిపారు. జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి సబ్ డివిజన్ పరిధిలోని మతోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సీఎం భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి

టెంపో ట్రావెలర్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పోస్ట్ లో, "ఫలోడిలోని మతోడా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఇది హృదయ విదారకం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.

#WATCH | Jaipur | On Phalodi accident, Rajasthan Dy CM Premchand Bairwa says, "It is an extremely unfortunate incident. We should learn from such incidents. Today's incident is heartbreaking. The truck was standing still. Fifteen people have lost their lives. The administration… pic.twitter.com/rpwpTef7cL

— ANI (@ANI) November 2, 2025

సీఎం మాట్లాడుతూ.. "గాయపడిన వారందరికీ తగిన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. అదే విధంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.

మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం

ఈ విషాదకర ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. "ఫలోడిలోని మతోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారని నేను పాట్నాలో ఉన్నప్పుడు సమాచారం అందింది. ప్రమాదం గురించి చాలా బాధగా ఉంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.