హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు చెందిన హైదరాబాద్ లోని తన నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు.హైదరాబద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత విల్లాకు 1.60 కోట్ల రూపాయలు ఇంటి పన్ను బకాయిలు ఉండటంతో GHMC అధికారులు విల్లాను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఇంటి పన్ను బకాయిలు పెండింగ్ లో ఉండటం, పలు మార్లు నోటీసులు ఇచ్చినా, ఎవరూ స్పందించకపోవడంతో జయలలికు చెందిన హైదరాబాద్ నివాసాన్నిస్వాధీనం చేసుకున్నారు.

ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారావేత్త విజయ్ మాల్య లీజుకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ మాల్యా లీజుకు తీసుకున్న నాటి నుండి నేటి వరకూ ఇంటి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో , పెండింగ్ బకాయిలు పేరుకుపోయినట్లుగా అధికారులు గుర్తించారు.తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన జయలలిత, ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు తమిళనాడు ప్రజలకు సేవలందిచారు. తమిళనాడు ప్రజలు ఆమెను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.నేటికీ తమిళనాడులో జయలలిత క్రేజ్ తగ్గలేదు. ఆమె భౌతికంగా లేనప్పటికీ , ఆమె అభిమానులు, నాయకులు పెద్దసంఖ్యలో ఉన్నారు. తమినాడు రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా అమ్మ ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు.

తమిళనాడులో అనారోగ్యం కారణంగా జయలలిత మరణించిన నాటి నుండి ఆమె ఆస్తులపై వివదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆమెపై నమోదైన ఆదానికి మించి ఆస్తులున్న కేసు దేశవ్యాప్తంగా పెను దమారం రేపింది. అప్పట్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా మూడు ట్రంకు పెట్టెల్లో భద్రపరిచి ప్రభుత్వానికి ఆమె ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ అధికారులు అప్పగించారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ నగరంలో జయలలితకు చెందిన విల్లా సీజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.