Thalapathy Vijay's Jana Nayakudu Telugu Trailer Out Now : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయకుడు'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మూవీ టీం ట్రైలర్‌ రిలీజ్ చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

'జన నాయకుడు' మూవీ తన చివరి సినిమా అంటూ విజయ్ స్వయంగా అనౌన్స్ చేయడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తమిళంలో జన నాయగన్, తెలుగులో జన నాయకుడు, హిందీలో జన నేతగా రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ గాడ్ ఆఫ్ మాసెస్, స్టార్ డైరెక్టర్ అనిల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే రూమర్స్‌కు ట్రైలర్‌లో ఆన్సర్ దొరికింది. పొలిటికల్ అంశాలతో పాటు ఎమోషన్, సెంటిమెంట్ కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా ఇప్పటికే రిలీజ్ చేసిన 'కచేరీ' సాంగ్ ట్రెండ్ అవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అవుతున్నారు.

Also Read : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...