రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తమిళ దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయకుడు'. తమిళంలో 'జన నాయగన్'. థియేటర్లలో విడుదల కాక ముందే ఇటు నేషనల్, అటు ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌లో దుమ్ము రేపుతోందీ సినిమా. విజయ్ ఫ్యాన్స్, తమిళ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఇదొకటి. 'జన నాయగన్' జనవరి 9న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. విడుదలకు ముందే ప్రీ -సేల్స్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

'జన నాయకన్' అడ్వాన్స్ బుకింగ్ @ 7.75 కోట్లు
'జన నాయకన్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి, అలాగే ఇది ఆయన చివరి సినిమా కనుక అభిమానులలో 'జన నాయగన్'పై మరింత క్రేజ్ నెలకొంది. అలాగే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా బావున్నాయి. సైకానిల్క్ నివేదిక ప్రకారం... జనవరి 6 ఉదయం 9 గంటల నాటికి భారత దేశంలో 'జన నాయగన్' 1,58,781 టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి. రూ. 4.93 కోట్ల వసూళ్లు సాధించింది. బ్లాక్ సీట్లతో కలిపి 7.75 కోట్ల వసూళ్లు సాధించింది.

Also Read: రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ప్రభాస్ సినిమా క్లైమాక్స్ అదిరిందట - టాక్ ఏమిటంటే?

విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఎంత జరిగింది?
భారత దేశంలో 'జన నాయగన్' మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రస్తుతం 7 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిందని, ఇందులో కేవలం కర్ణాటకలోనే 4 కోట్ల రూపాయలకు పైగా ప్రీ - టికెట్ సేల్స్ జరిగాయని తెలుస్తోంది. సైకానిల్క్ గణాంకాల ప్రకారం, ఈ సినిమా విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 25 కోట్ల రూపాయల మార్కును దాటింది. ఇలాంటి ప్రీ - సేల్స్‌ను చూస్తుంటే... కోలీవుడ్ నుండి వస్తున్న ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: జనసేనానికి వ్యతిరేకంగా... లేదంటే ఆ వీడియోలు విడుదల చేస్తాం - పూనమ్ కౌర్‌కు బెదిరింపులు

'జన నాయగన్'లో ఎవరెవరు నటించారు?
దళపతి విజయ్ హీరోగా నటించిన 'జన నాయగన్' సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. విజయ్‌తో పాటు బుట్ట బొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మమిత బైజు, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నారాయణ్ వంటి నటీనటులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. 'జన నాయగన్' భారతదేశం అంతటా విడుదల అవుతోంది. హిందీలో ఈ సినిమాను 'జన నేత' పేరుతో థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్ అని ట్రైలర్ బట్టి స్పష్టం అవుతోంది.

Also Read: ఎయిర్ పోర్ట్‌లో జంటగా దొరికేసిన రష్మిక - విజయ్ దేవరకొండ... న్యూ ఇయర్ తర్వాత ఇటలీ నుంచి ఇండియాకు