Thalapathy Vijay's Jana Nayagan Cast Fees : కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' (Jana Nayagan) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సార్ వివాదంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా దాదాపు 7 నెలల తర్వాత థియేటర్లలోకి రిలీజైంది. మధ్యలో లీకేజీ సమస్యలు కూడా ఇబ్బందులు పెట్టాయి. ఎట్టకేలకు ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడింది. సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్, చెన్నై సహా ప్రధాన నగరాల్లో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

సోషల్ మీడియాలో జన నాయగన్ పోస్టులతో ఫ్యాన్స్ సందడి చేస్తుండగా... విజయ్ సహా ఇతర నటీనటులు రెమ్యునరేషన్స్‌పై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. తన లాస్ట్ మూవీ అని అనౌన్స్ చేసిన దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అంత రెమ్యునరేషనా?

'జన నాయగన్' మూవీ కోసం విజయ్ దాదాపు రూ.225 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో ఇండియన్ హీరోకు ఇచ్చిన అత్యధిక రెమ్యునరేషన్లలో ఒకటని టాక్ వినిపిస్తోంది. ఆయనతో పాటే డైరెక్టర్ హెచ్. వినోద్‌కు రూ.25 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. విలన్ రోల్ చేసిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్యలో అందుకున్నట్లు సమాచారం.

అలాగే, హీరోయిన్ పూజా హెగ్డే రూ.6 కోట్లు, ప్రకాశ్ రాజ్‌కు రూ.5 కోట్లు, ప్రియమణి రూ.3 కోట్లు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా రూ.3 కోట్లు, నరైన్ రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన మమితా బైజు రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్యలో, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రూ.13 కోట్ల పారితోషకం అందుకున్నట్లు చర్చ నడుస్తోంది. అయితే, ఈ రెమ్యునరేషన్స్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు.

Also Read : Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?