Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
3 months ago 7
ARTICLE AD
తమిళనాడు ముఖ్యమంత్రి, ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన 'జన నాయకన్'కు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ... బాక్సాఫీస్ బరిలో ఫస్ట్ వీకెండ్ (నాలుగు రోజుల పాటు) అద్భుతమైన వసూళ్లను సాధించింది. కానీ ఆరో రోజు... (థియేటర్లలో విడుదలైన మొదటి మంగళవారం) సినిమా జోరు తగ్గింది. అటు తమిళ్, ఇటు మిగతా భాషల్లోనూ కలెక్షన్స్ తగ్గాయి. 'జన నాయకన్'కు ఆరో రోజు ఎన్ని కోట్లు వచ్చాయి? టోటల్ కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే...
మంగళవారం 'జన నాయకన్' కలెక్షన్స్ ఎంత?
Jana Nayagan Six Days Collection: ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ. 246.07 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది 'జన నాయకన్'. నెట్ ఎంత? గ్రాస్ ఎంత? ఓవర్సీస్ మార్కెట్టులో ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...
'జన నాయకన్'కు ఆరో రోజు (జూలై 28, మంగళవారం) ఇండియాలో 8 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో ఆరు రోజుల నెట్ కలెక్షన్స్ 143.40 కోట్లు అయ్యాయి.
ఇండియాలో ఆరు రోజుల 'జన నాయకన్' గ్రాస్ కలెక్షన్లు రూ. 167.57 కోట్లు.
'జన నాయకన్'కు ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ. 246.07 కోట్ల గ్రాస్ వచ్చింది. బుధవారం కలెక్షన్లతో ఈ సినిమా రూ. 250 కోట్ల క్లబ్బులో చేరడం గ్యారెంటీ.
Also Read: Chennai Love Story Five Days Collection - వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
తమిళంలో ఆరు కోట్లు, తెలుగులో 60 లక్షలే!
భాషాల పరంగా చూస్తే... ఆరో రోజు (మంగళవారం) తమిళ వెర్షన్ రూ. 6.15 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ నుంచి రూ. 1.25 కోట్లు రాగా... తెలుగులో కేవలం 60 లక్షల రూపాయలే వచ్చాయి. రాష్ట్రాల వారీగా చూస్తే... తమిళనాడులో మంగళవారం రూ. 5.50 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటకలో కోటి, కేరళలో 70 లక్షలు, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షలే వచ్చాయి.
హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయకన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే నటించారు. మమితా బైజు కీలక పాత్ర పోషించారు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి విలన్ రోల్స్ చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
Read Entire Article