Jailer 2: 'జైలర్ 2' తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ ఎంత... నాగవంశీ ఎంతకు కొన్నారంటే?
1 month ago 2
ARTICLE AD
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా రూపొందిన ప్రతిష్టాత్మక సినిమా 'జైలర్ 2' (Jailer 2 Movie). ఇంతకు ముందు బ్లాక్ బస్టర్ సాధించిన 'జైలర్' సినిమాకు సీక్వెల్ ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ఎన్ని కోట్లకు 'జైలర్ 2' రైట్స్ తీసుకున్నారంటే?
ఏపీ, తెలంగాణ వరకు మాత్రమే!
Jailer 2 AP Telangana Rights: 'జైలర్ 2'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం తొలుత పోటీ నెలకొంది. 'దిల్' రాజు సైతం రేసులో నిలిచారు. అయితే... మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండో పార్ట్ రైట్స్ ఎక్కువ రేటు చెప్పారు. అందుకని ఆయన వెనక్కి తగ్గారు. చివరకు నాగవంశీ 'జైలర్ 2' రైట్స్ సొంతం చేసుకున్నారు.
'జైలర్ 2' రైట్స్ నాగవంశీ తీసుకున్న మాట నిజమే. అయితే... తెలుగు వెర్షన్ టోటల్ రైట్స్ తీసుకోలేదు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ వరకు ఆయన తీసుకున్నారు. అదీ 45 కోట్ల రూపాయలకు.
Also Read: One Sun One Moon Lyrics - 'జైలర్ 2'లో సాంగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్సే... రజనీకి ఓ రేంజ్ ఎలివేషన్ - ఏం రాశారంటే?
బాక్సాఫీస్ బరిలో 'జైలర్ 2' భారీ విజయం సాధించాలంటే ట్రైలర్, మిగతా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ బజ్ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతానికి తమిళనాట భారీ బజ్ నెలకొంది. మొదటి పార్ట్ సక్సెస్ వల్ల సీక్వెల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ... ట్రైలర్, మిగతా సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ థియేటర్లకు జనాల్ని రప్పించాల్సి ఉంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న రిలీజ్ అవుతుంటే... మర్నాడు, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న 'రణబాలి' విడుదల కానుంది. తెలుగులో రజనీ సినిమాకు అది కాంపిటీషన్ అవుతుందని చెప్పాలి.
Read Entire Article