Rajinikanth's Jailer 2 First Day WorldWide First Day Collection : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 (Jailer 2). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ సాధించింది.

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ జైలర్ 2 రికార్డు స్థాయిలో రూ.125.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఇండియావ్యాప్తంగా రూ.70.25 కోట్ల గ్రాస్, రూ.59.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. అటు, ఓవర్సీస్‌లో రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళ వెర్షన్ రూ.43.35 కోట్లు, హిందీ వెర్షన్ రూ.3.50 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.35 లక్షల నెట వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే మొత్తంగా అన్నీ భాషల్లో కలిపి 55.4 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

కలెక్షన్స్ వివరాలు ఇలా

జైలర్ 2 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.125.25 కోట్లు

ఇండియావ్యాప్తంగా నెట్‌ వసూళ్లు - రూ.59.70 కోట్లు

ఇండియావ్యాప్తంగా గ్రాస్‌ వసూళ్లు - రూ.70.25 కోట్లు

ఓవర్సీస్‌ గ్రాస్‌ - రూ.55 కోట్లు.

మూవీలో రజనీ కాంత్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, విద్యాబాలన్‌, ఎస్‌.జే. సూర్య, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణన్‌, సునీల్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2023లో వచ్చిన జైలర్‌ సినిమాకు ఇది సీక్వెల్. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.

Also Read : Crime Thriller OTT : ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

విగ్రహాల అక్రమ రవాణాలో తన కొడుకు భాగమయ్యాడని తెలుసుకున్న ముత్తువేల్ పాండియన్ (రజనీ కాంత్) అతన్ని చంపేస్తాడు. ఇందులో కీలక భాగమైన వర్మను కూడా చంపిన తర్వాత తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముత్తువేల్‌ ఓ మారుమూల ప్రాంతంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ సూపర్ మార్కెట్‌లో సూపర్వైజర్‌గా వర్క్ చేస్తుంటాడు. కానీ వర్మను చంపిన వ్యక్తిని పట్టుకునేందుకు కేరళలోని దిలీప్ (సూరజ్ వెంజరమూడు) మనుషులు వెతుకుంటారు.

ఇదే టైంలో దిలీప్ వెనుక, విగ్రహాల స్మగ్లింగ్ వెనుక గోవాలోని చక్రి కల్పక్ (మిథున్ చక్రవర్తి) ఫ్యామిలీ ఉందని టైగర్ ముత్తువేల్ తెలుసుకుంటాడు. విగ్రహాలతో కూడిన తమ మూడు కంటైనర్లు ఇవ్వమని లేదంటే కుటుంబాన్ని అంతం చేస్తామని ముత్తువేల్‌కు కల్పక్ ఫ్యామిలీ బోధి కల్పక్ (ఎస్.జె. సూర్య), కుమార్తె కాంత (విద్యా బాలన్) వార్నింగ్ ఇస్తారు. స్నేహితుడు (శివరాజ్ కుమార్) మీద ఎటాక్ చేసి అతని భార్య, పిల్లల్ని బంధిస్తారు. అప్పుడు టైగర్ ముత్తువేల్ పాండ్యన్ ఏం చేశారు? స్నేహితుడి కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Ranabaali Review - 'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.