Jagadhatri Serial Today Episode మీనన్‌ నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి యువరాజ్ రావడం.. మీనన్ బెదిరించడంతో జేడీ అందరి ప్రాణాలు కాపాడటం కోసం హార్డ్ డిస్క్ ఇచ్చేస్తుంది. మాస్క్ వేసుకొని వచ్చింది తన భర్త యువరాజ్‌ అని నిషికకు తెలిసిపోతుంది. అక్కడే ఉంటే ముప్పు అని కౌషికి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోతుంది.

జేడీ, కేడీలకు సాధు సార్ కాల్ చేస్తారు. ఒకరు ఇద్దరు తప్ప ఆడిటోరియంలోని మిగతా అందర్ని కాపాడామని చెప్తుంది. మీనన్ తప్పించుకున్నాడని అంటుంది. ఇక హార్డ్ డిస్క్ కోసం సాధు సార్ అడిగితే ప్రొఫెసర్ సేఫ్ హార్డ్ డిస్క్ కూడా సేఫ్‌గా నా దగ్గరే ఉందని జేడీ చెప్పి షాక్ ఇస్తుంది. మీనన్ తనకు జేడీ నిజంగానే హార్డ్ డిస్క్ ఇచ్చేసిందని సంబరపడిపోయి వెళ్లి ల్యాప్‌టాప్‌కి కనెన్ట్ చేసి చూస్తే అదిదా సర్‌ఫ్రైజ్ అనే పాట ప్లే అవుతుంది. జేడీ తనని మళ్లీ దెబ్బ కొట్టిందని మీనన్ ముఖం మాడిపోతుంది.

ప్రొఫెసర్ జేడీ జగద్ధాత్రి ఒక్కరే అని షాక్ అయిపోతారు. ఇక ప్రొఫెసర్ జేడీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తారు. మీ లాంటి వారు ఉంటేనే మన దేశానికి చాలా గొప్ప సంపద అని మీరు మన దేశానికి వెల కట్టలేని సంపద సార్ అని చెప్తుంది. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు కూడా దేశానికి చాలా అవసరం అని ప్రిఫెసర్ సెల్యూట్ కొట్టి వెళ్లిపోతుంది.

వీరావేశంతో వెళ్లిన మీనన్ పరిస్థితి ఏంటి అని కేడీ అనగానే మీనన్ కాల్ చేస్తాడు. జేడీతో గెలిచాను అని సంబర పడకు ఎక్కడో ఒక చోట దొరికిపోతావ్ అని అంటాడు. ఆ చోటే నువ్వు నాకు దొరకాలి అని నేను కోరుకుంటూ ఉంటా.. జైలులో జీవితాంతం చిప్ప కూడు తినడానికి రెడీగా ఉండు.. లూజర్ మీనన్ అని అంటుంది. జేడీ ఫోన్ పెట్టగానే మీనన్ ఐయామ్ నాట్ ఏ లూజర్ అని అరుస్తాడు.

నిషిక గదిలోకి వెళ్లి యువరాజే మాస్క్ వేసుకొని వచ్చి ఒకర్ని చంపడం.. తనని కొట్టడం.. బాంబ్ పెట్టడం అన్నీ తలచుకొని కోపంతో రగిలిపోయి గదిలో అన్నీ విసిరికొడుతుంది. ఇక హాల్‌లో కౌషికి, వైజయంతి, సుధాకర్ ఆ దారుణాన్ని తలచుకొని అలా ఎలా ప్రాణాలు తీసేస్తారు అని తిట్టుకుంటారు. ఇంతలో యువరాజ్ వైజయంతి కంగారుగా మొత్తం కొడుకుతో చెప్తుంది. యువరాజుతో చివరకు మాస్క్ వేసుకొని వచ్చిన రౌడీ చచ్చినోడు మన అమ్మిని కొట్టాడు. మమల్ని రానివ్వడం లేదు నువ్వే ధైర్యం చెప్పు అని యువరాజ్‌కి చెప్తుంది. నిషిక చంపేస్తుందని అనుకొని యువరాజ్ వెళ్తాడు.

జగద్ధాత్రి, కేథార్‌లు ఇంటికి వచ్చి ఆడిటోరియంలో జరిగిన దాన్ని తలచుకొని బాధ పడొద్దు అంటారు. కౌషికి షాక్ అయి మీకు ఎలా తెలుసు అంటుంది. దాంతో ఇద్దరూ కవర్ చేస్తారు. యువరాజ్ గదిలోకి వెళ్లి గది మొత్తం చిందర వందర చూసి ఏమైందని అడుగుతాడు. ఏమైందో నీకు తెలీదా అని యువరాజ్‌ని లాగిపెట్టి కొట్టి కట్టుకున్న భార్య అని కూడా లేకుండా నన్ను కొట్టి హింసించావ్.. అసలు నువ్వు నా భర్తవేనా ఛీ.. నీ ముఖం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నన్ను చంపడానికి రెడీ అయ్యావ్.. ఇంక నీకు నేను ఎందుకు.. నీ కోసం ఎలా బతకాలి నేను.. నువ్వో కసాయి వాడివి.. నువ్వు ఇలాంటి వాడివి అని తెలిశాక నేను నీతో ఉండలేను.. నేను మా ఇంటికి వెళ్లిపోతాను అని అంటుంది.

యువరాజ్ నిషికతో ఏం తెలీకుండా మాట్లాడకు అంటే ఏం తెలుసుకోవాలి చెప్పు ఏం తెలుసుకోవాలి.. వింటాను చెప్పు.. ఎందుకు నన్ను మామయ్య వాళ్లని కిడ్నాప్ చేశావ్.. మేం చనిపోతా అని తెలిసి కూడా మమల్ని ఎందుకు ఆడిటోరియానికి పంపావ్.. ఎందుకు నా తల మీద గన్ పెట్టి నన్ను చంపడానికి కూడా ట్రై చేశావ్ అని అడుగుతుంది. జేడీ, కేడీలు నిన్ను ఎందుకు మీనన్ మనుషులు అన్నారు.. వాళ్లకి నీకు సంబంధం ఏంటి.. అని నిషిక ప్రశ్నిస్తుంది. నిషిక, యువరాజ్‌ల మాటలు మొత్తం కౌషికి వినేసి యువరాజ్‌ని లాక్కొని తీసుకెళ్తుంది.

వైజయంతితో పాటు అందరూ ఏమైందని అడుగుతారు. నువ్వేం చేశావో నీ నోటితో చెప్తావా లేక నీ భార్యతో చెప్పించాలా అని అడుగుతుంది. ఆడిటోరియంలో మాస్క్‌తో వచ్చి నిషికని కొట్టింది యువరాజే అని చెప్తుంది. వీడు ఇంకా మారలేదు బాబాయ్.. వీడు ఇంకా మీనన్‌ మనిషిగానే ఉంటూ.. దారుణాలు చేస్తూ ఉంటాడు కుంభమేళాలో సీఎం మీద అటాక్ చేసింది యువరాజే అని.. డ్రగ్స్, ఫేక్ కరెన్సీ.. ఇలా అన్నీ ఇల్లీగల్ పనులు చేసేది మన యువరాజే బాబాయ్.. అందుకు సాక్ష్యం వాడి భార్య అని అంటుంది.

వైజయంతి ఏడుస్తూ కౌషికి చెప్పింది అబద్ధం అని చెప్పరా అబ్బోడా అని అంటుంది. యువరాజ్ మౌనమే అందుకు అంగీకారం అని మీకు అర్థం కావడం లేదా అని జగద్ధాత్రి అంటుంది. దానికి వైజయంతి నువ్వు ఆగు అమ్మీ ఇది మా కుటుంబ సమస్య నువ్వు మధ్యలోకి రాకు అని అంటుంది. సుధాకర్ కూడా ప్రశ్నించడంతో నేను మిమల్ని కాపాడుకోవడానికి ఆడిటోరియానికి వచ్చానని అంటాడు. మీ అమ్మ ఇందాక అడిగితే అదంతా చెప్పలేదు అంతలోనే రెండు నాలుకలా అని సుధాకర్ అడిగితే వాడికి రెండు నాలుకలు కాదు రెండు బుద్ధులు అని కౌషికి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.