Jagadhatri Serial Today Episode మీనన్ ప్రొఫెసర్‌ని బెదిరించడంతో ప్రొఫెసర్ నీటితో నడిచే యంత్రం ఇంకా తయారు కాలేదు ఏడాది పడుతుందని అందరితో చెప్తాడు. జేడీ, కేడీలతో పాటు కౌషికి వాళ్లు షాక్ అవుతారు. మనతో ప్రాజెక్ట్ పూర్తి అయిందని చెప్పిన ప్రొఫెసర్ ఇలా చెప్పారేంటి అని కౌషికి సుధాకర్‌తో అంటుంది.

సుధాకర్ దారిలో జరిగింది అంతా చెప్తాడు. ఫ్యామిలీని ఏమైనా చేస్తారనే భయంతో ఇలా చెప్తున్నారేమో అని సుధాకర్ అంటాడు. కేడీతో జేడీ ఇప్పుడు అర్థమైంది మీనన్ బెదిరించాడని అంటుంది. ఆ ఫార్ములాకి మీనన్‌నే అధిపతి అవ్వాలని ప్రయత్నిస్తున్నాడని జేడీ అంటుంది.. వెంటనే లైవ్ ఆపాలని కౌషికి దగ్గరకు వెళ్లి లైవ్‌ ఆపమని సుందరం గారికి ప్రమాదం ఉందని చెప్తుంది. కౌషికి లైవ్ ఆపించేస్తుంది. మీనన్ లైవ్ రాకుండా ప్రోగ్రాం రావడంతో షాక్ అయిపోతాడు. యువరాజ్‌కి చూపిస్తాడు. లైవ్‌ ఆపేశారని యువరాజ్ చెప్తాడు. మీనన్ వెంటనే సుందరంని అడుగుతాడు. జేడీ, కౌషికి మాట్లాడుకున్నారని అంటాడు.

యువరాజ్‌తో మీనన్ సీన్‌లోకి జేడీ దిగేసింది.. నా ప్లాన్ పసిగట్టేసింది. ఇక రక్తం పాతం చేయాల్సిందే అని అంటాడు. వెంటనే జేడీకి కాల్ చేస్తాడు. నీ తెలివికి జోహార్‌ జేడీ.. ఈ ప్రోగ్రాం హీరో సుందరాన్ని ఒక్క సారి చూడు నేను తలచుకుంటే వాడు ఉండడు. అర్థం కాలేదా వాడి నడుముకి బెల్ట్ బాంబ్ పెట్టాను.. షాక్ అయ్యావ్ కదూ.. రిమోట్ నొక్కితే వాడు చస్తాడు.. అని మీనన్ అంటాడు. నీకేం కావాలి అని జేడీ అడుగుతుంది. ఏం తెలీనట్లు భలే అడుగుతావ్ జేడీ నువ్వు.. నువ్వు ఆపించిన లైవ్ టెలీకాస్ట్ కాకపోతే నువ్వు ఆ హార్డ్ డిస్క్ నాకు తిరిగి ఇవ్వకపోతే బాంబ్ పేలిపోతుందని అంటాడు. ఐదు నిమిషాలు టైం ఇస్తా అని అంటుంది.

జేడీ అక్కడున్న వాళ్లని తప్పించాలని కేడీకి సైగ చేసి చెప్పడంతో కేడీ లేవమని హాల్లో ఉన్న వారికి చెప్తాడు. దాంతో ఇద్దరు ముగ్గరు లేవడంతో కుర్చీల కింద ఉన్న బాంబ్‌లు పేలుతాయి. అందరూ బిత్తర పోతారు. జేడీ, కేడీలు షాక్ అయిపోతారు. మీనన్ నవ్వుతూ కుర్చీల మీద నుంచి లేచినా కూడా బాంబ్ పేలిపోతుంది. ఎవరూ లేచినా సరే బాంబ్ బ్లాస్ అయిపోతుంది. ఎంత మంది చస్తారో తెలీదు.. ఆడిటోరియం పేలిపోతుంది అని అంటాడు మీనన్.

జేడీ వెంటనే అందరితో మీ కుర్చీల కింద బాంబ్‌లు ఉన్నాయి ఎవరూ లేవకండీ అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆ మనుషుల ప్రాణాలు పోతాయి. ప్రొఫెసర్ కూడా చస్తాడు అని అంటాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా చెప్పింది చేయ్ అని అంటాడు. ఆడిటోరియం డోర్స్ అతని మనుషులతో మూయించేస్తాడు. జేడీ కేడీతో ప్రొఫెసర్ నడుంకి బెల్ట్ బాంబ్ ఉంది.. ఇక్కడ ఉన్న కొంత మంది సీట్స్ కింద బాంబ్ ఉంది.. హార్డ్ డిస్క్ ఇస్తేనే వదులుతాను అన్నాడు అని చెప్తుంది. అందరూ కంగారు పడతారు.

యువరాజ్ మీనన్‌తో లోపల నా ఫ్యామిలీ కూడా ఉంది వాళ్లని బయటకు తీసుకురా అని అంటే మీనన్ యువరాజ్‌ని నోర్ముయ్‌ అని నేను చెప్పడం మాత్రమే నీ ముందు ఉన్న ఆప్షన్‌ అని అంటాడు. యువరాజ్ కోపంతో ఉంటాడు. జేడీ కేడీతో వాడు చెప్పినట్లు చేయలేం.. అందరిని కాపాడాలి అంటే మీనన్‌ని డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది. వెంటనే జేడీ ఇందులో యువరాజ్‌ ఉన్నట్లున్నాడు కాబట్టి ఇక్కడి భయం యువరాజ్‌కి చేరాలని అనుకుంటారు. వెంటనే కేడీ, జేడీలు సుందరం దగ్గరకు వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పి ఆ బాంబ్ ఇద్దరూ పేలకుండా చేస్తామని చేస్తూ వైజయంతి, నిషికలు భయపడేలా చేసి యువరాజ్‌ని వాళ్లు చెప్పేలా చేయాలని ప్రయత్నిస్తారు.

అత్తాకోడళ్లు భయపడతారు. కావాలనే జేడీ, కేడీలు ఆ వైర్ లాగితే ప్రమాదం ఈ వైర్ లాగితే ప్రమాదం అని వైజయంతికి కంగారు పెడతారు. వాడు అడిగింది చేసేద్దాం అని సుందరం అంటే అలా చేసినా ఇంత మంది సాక్ష్యుల్ని చంపేస్తాడు అని అంటారు. వైజయంతి నిషికతో మనం ఎలా అయినా చచ్చేలా ఉన్నాం కనీసం నా కొడుకు అయినా బతకాలి అని యువరాజ్‌కి కాల్ చేస్తుంది. ఏడుస్తూ యువరాజ్‌కి విషయం చెప్తుంది. నిషిక కూడా మేం బతకం నువ్వు ప్రాణాలతో బతుకు ఇవే మేం నీతో మాట్లాడుతున్న చివరి మాటలు అని ఇద్దరూ ఏడుస్తారు. భార్య, తల్లి మాటలకు యువరాజ్ ఎమోషనల్ అయిపోతాడు. ఇక పాము వచ్చిందని ఓ వ్యక్తి కుర్చీ మీద నుంచి లేవడంతో అది కూడా పేలి ఆయన చనిపోతారు. నా ఫ్యామిలీకి ఏం కాకూడదు అని యువరాజ్ అనుకుంటాడు. కేడీ బెల్ట్ బాంబ్ ప్రొఫెసర్ నడుం దగ్గర నుంచి తీసేస్తాడు. ఆ బాంబ్ టైమర్ మొదలైపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.