Jagadhatri Serial Today Episode యువరాజ్ తన ఫ్యామిలీతో పాటు, ప్రొఫెసర్ వాళ్లని తీసుకెళ్లిపోతాడు. కేడీ, జేడీలు కారు నెంబరుతో వాళ్లని ట్రేస్ చేయమని అంటారు. యువరాజ్ హార్డ్‌ డిస్క్ ఇవ్వమని ప్రొఫెసర్‌ని అడుగుతాడు.

ప్రొఫెసర్ హార్డ్ డిస్క్ తన దగ్గర లేదని చెప్తాడు. మమల్ని వదిలేయ్ అని నిషిక యువరాజ్ చేయి పట్టుకుంటే ముక్కు మీద ఒకటి ఇస్తాడు. సుధాకర్ వాళ్లు మాట్లాడుతుంటే అందర్ని నోరు మూసుకోమని చెప్తాడు. హార్డ్ డిస్క్ గురించి అడిగితే హార్డ్ డిస్ట్ ఇంటి దగ్గరే జేడీ టీం తీసుకున్నారని చెప్తాడు. యువరాజ్ వెంటనే మీనన్‌కి విషయం చెప్తాడు. జేడీ హార్డ్ డిస్క్ పట్టుకొని నువ్వేం చేయలేవ్ మీనన్ అనుకుంటుంది. ఇక జేడీ టీం లొకేషన్ ట్రేస్ చేసి యువరాజ్ కిడ్నాప్ చేసిన కారుని ఆపుతుంది. అందరికీ గన్ గురి పెడుతుంది. అందులో డ్రైవింగ్ సీట్ నుంచి సుధాకర్ వస్తాడు.

కేథార్ ప్రొఫెసర్‌తో మిమల్ని ఎవరూ కిడ్రాప్ చేయలేదా అని అడిగితే పక్కకి తీసుకెళ్లి నన్ను చెక్ చేసి వదిలేశాడని ప్రొఫెసర్ చెప్తాడు. ప్రొఫెసర్ వాలకం చూసి చాలా భయపడుతున్నారని జేడీ అనుకుంటుంది. హాస్పిటల్‌కి వెళ్దాం అని అడిగితే వద్దని అనేస్తారు. ప్రొఫెసర్ టెన్షన్ చూసి సుధాకర్ ఏమైందిరా టెన్షన్ పడుతున్నావ్ అంటే ఏం లేదని భయపడతాడు. జేడీ, కేడీలు ప్రొఫెసర్ గురించి మాట్లాడుకుంటారు. ప్రొఫెసర్‌ని కొట్టినట్లున్నారు. చెమటలు పట్టున్నారు ఏదో అయింది.. మీనన్ ఏదో ప్లాన్ చేశాడని జేడీ, కేడీలు అనుకుంటారు.

ప్లాష్ బ్యాక్‌లో యువరాజ్ మీనన్ చెప్పాడని ప్రొఫెసర్‌ని మీనన్ దగ్గరకు తీసుకెళ్తారు. మీనన్ ప్రొఫెసర్‌కి బాంబ్ ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్ ఏం మాట్లాడుతున్నారో తెలిసేలా ఇయర్ ఫోన్స్ పెట్టి ఏం మాత్రం డౌట్ వచ్చినా చంపేస్తా అని చెప్తారు. ఇక ఆడిటోరియంలో నీటితో నడిచే వాహనం ఇంకా తయారవ్వడానికి ఏడాది పడుతుందని చెప్పాలని తర్వాత తనకి డేటా ఇచ్చేయాలని బెదిరిస్తారు. ప్రొఫెసర్ ఏం చెప్పకుండా సుధాకర్‌లో వాళ్లతో వెళ్లిపోతాడు.

కేడీ, జేడీలు మీనన్ ప్లాన్ ఎలా అయినా తెలుసుకోవాలని అనుకుంటారు. అందరూ ఆడిటోరియానికి చేరుకుంటారు. జేడీ, కేడీలు బయట అందరినీ అలర్ట్ చేస్తారు. ప్రొఫెసర్ భయాన్ని చూసి జేడీకి అనుమానం వస్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారు కానీ ఈయన దేనికో భయపడుతున్నారు. మీనన్ ఆ డేటా వచ్చేస్తే అమ్మేసి అపర కేభేరుడిని అయిపోతానని అనుకుంటాడు. అక్కడ జరుగుతున్న లైవ్‌ని చూస్తుంటాడు. కౌషికి అక్కడే వాళ్ల ఛానెల్‌లో లైవ్‌ ఇప్పిస్తూ సుధాకర్ టెన్షన్‌గా ఉండటం చూసి అడుగుతుంది. ఏం లేదని సుధాకర్ అంటాడు.

యాంకర్ ప్రొఫెసర్‌ని పిలిచి మాట్లాడమని అంటాడు. ప్రొఫెసర్ వెళ్లి వణికిపోతూ ఉంటాడు. మీనన్ తను చెప్పినట్లు ఇంకా ప్రొఫెసర్ చెప్పడం లేదని తెగ టెన్షన్ అయిపోతాడు. ఇక జేడీ కేడీతో అందరూ నార్మల్‌గా ఉన్నారు కానీ ఒక్క ప్రొఫెసర్ భయంగా ఉన్నారని అంటుంది. ప్రొఫెసర్ నెంబరుకి కాల్ చేయమని అంటుంది. కాల్ బిజీగా వస్తుందని కేడీ చెప్పడంతో మీనన్ లైన్‌లో ఉన్నాడు. ఇక్కడ జరిగింది అంతా వింటున్నాడు.. అని జేడీ అంటుంది. మీనన్ మరోసారి బెదిరించడంతో ప్రొఫెసర్ తన ప్రాజెక్ట్ పూర్తి కాలేదని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఏడాది పడుతుందని అంటాడు. అందరికీ క్షమాపణలు చెప్పిస్తున్నాడు. కేడీకి మొత్తం అర్థమైపోతుంది. మీనన్ ఇలా చెప్పించేస్తే ఇక ఎవరూ పట్టించుకోరని తర్వాత ఆ డేటా కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడని లైవ్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని జేడీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.