Jagadhatri Serial Today Episode సురేశ్‌ని బస్తీ వాసులు చెట్టుకు కట్టేసి కొడతారు. జగద్ధాత్రి, కౌషికి, కేథార్ విడిపిస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఊరి పెద్దలు అంటే జగద్ధాత్రి వద్దని కౌషికితో పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీలు అవీ ఇవీ అని మీరు తట్టుకోలేరు వదినా.. నిజం నిరూపించే లోపు అబద్ధం పాకేస్తుంది మీరు ఆ మాటలు తట్టుకోలేరని కౌషికికి సర్ది చెప్పి మేం మాట్లాడుతాం అని అంటారు.

గౌరీ వాళ్లతో రెండు రోజుల్లో నా పెళ్లి ఇప్పుడు ఇతను నా జీవితం అన్యాయం చేశాడు పెళ్లి ఆగిపోయింది. నాకు దిక్కు ఏంటి.. ఎవరు నన్ను ఆదుకుంటారు అని గౌరీ ఏడుస్తుంది. సురేశ్ కౌషికితో నేను ఏం తప్పు చేయలేదు కౌషికి అని అంటాడు. గౌరీ సురేశ్‌ని వాడు వీడు అని వీడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయింది అని ఏడుస్తుంది. ఊరి పెద్ద జగద్ధాత్రి వాళ్లతో పెళ్లి చేసుకోవాలి అంటే 25 లక్షలు అడుగుతున్నాడు అంత మేం ఇవ్వలేం ఇప్పుడు గౌరీ పరిస్థితి ఏంటి ఆ పాతిక లక్షలు మీరు ఇస్తారా అని పెద్దాయన అడుగుతాడు. ఇస్తాం అని జగద్ధాత్రి మాటిస్తుంది.

కౌషికి జగద్ధాత్రితో ఆ డబ్బు మనం ఇస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కదా.. అని అంటుంది. జగద్ధాత్రి కౌషికితో ముందు లక్ష ఇచ్చి అన్నయ్యని విడిపిద్దాం అని అంటుంది. జగద్ధాత్రి పెద్దాయనతో ఇప్పుడు లక్ష ఇస్తామని చెప్తుంది. రేపు మధ్యాహ్నంలోపు మిగతా డబ్బు ఇవ్వాలి లేదంటే ఊరుకోమని పెద్దాయన అంటాడు. కేథార్ లక్ష పంపిస్తాడు. జగద్ధాత్రి గౌరీని అనుమానంగా చూస్తుంది.

జగద్ధాత్రి, కేథార్, కౌషికిలు సురేశ్‌ని ఇంటికి తీసుకెళ్తారు. సురేశ్ కౌషికితో నా తప్పు లేదు అదే తట్టుకోలేకపోతున్నా.. నేను అలా చేస్తానా అని అంటాడు. నిన్ను నేను తప్పుగా అనుకోవడం లేదు సురేశ్ అసలు అంత నింద నీ మీద ఎందుకు వేశారు అని జరిగింది అడుగుతుంది. సురేశ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తాను కారులో వెళ్తుంటే ఫోన్ వస్తే చూశానని ఇంతలో గౌరీ కారు కింద పడిందని చెప్తాడు. గౌరీ కాలు బెనికిందని బస్తీలో దింపమని చెప్తుంది. సురేశ్ గౌరీని కారు ఎక్కించుకుంటాడు. గౌరీ సురేశ్‌తో నా అకౌంట్ నెంబరుకి ఒక లక్ష వేయమని అడుగుతుంది. ఎందుకు అని సురేశ్ అడిగితే మా నాన్నకి బాలేదు అని అంటుంది. నాకు అన్నీ హాస్పిటల్స్ తెలుసు ట్రీట్మెంట్‌ ఇప్పిస్తానని సురేశ్ అంటే నాకు లక్ష ఇవ్వు అని అంటుంది. సురేశ్ ఇవ్వను అనడంతో ఇప్పుడు ఎలా ఇవ్వవో చెప్తా అని సురేశ్ పర్స్ తీసుకొని వెళ్లడం వెనకాలే సురేశ్ వెళ్లడంతో పాడు చేశాడని ఊరి పెద్దతో చెప్తుంది. దాంతో ఊరి పెద్ద అతన్ని చెట్టుకి కట్టేసి కొట్టారని చెప్తాడు. నిన్ను మేం కాపాడుకుంటామని కౌషికి వాళ్లు చెప్తారు.

నిషిక సురేశ్ తప్పు చేసినట్లు మాట్లాడుతుంది. ఆడపిల్ల అలా అబద్ధం చెప్పదు కదా అని సురేశ్ తప్పు చేసుంటాడని అన్నయ్యని దోషిలానే చూడాలని అంటుంది. కౌషికి కోప్పడితే మీకు కోపం వస్తుందా.. మీ భర్తని అంటే మీకు అలా ఉంటే నా భర్తని అంటే నాకు ఎలా ఉంటుంది. మీ లాంటి మనసే కదా మాకు ఉంటుంది అని అంటుంది. యువరాజ్ తప్పు చేశాడు.. బావ నింద మోస్తున్నాడు ఇద్దరినీ కలిపి చూడకు అని కేథార్ అంటాడు. యువరాజ్ విషయంలోనే మీకు పరువు పోతుందా ఇప్పుడు పోలేదా అని అడుగుతుంది. నిషికి వైజయంతి సపోర్ట్ చేస్తుంది. సురేశ్‌ని ఆడిపోసుకోవద్దని జగద్ధాత్రి అంటుంది. నా భర్త ఏం తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తా అని కౌషికి అంటుంది. బావ తప్పు చేయలేదు అని నిరూపించడానికి వేయి దారులు ఉన్నాయి యువరాజ్ తప్పు చేయలేదు అని చెప్పడానికి ఒక్క దారి అయినా ఉందా అని కేథార్ పిన్నిని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.