Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి శ్రీవల్లి బ్యాగ్‌ మీద కేథార్ తల్లి ఫొటో చూసే టైంకి సంధ్య కాల్ చేయడంతో ఫోటో పక్కన పెట్టేస్తుంది. సంధ్య జగద్ధాత్రితో కేథార్ గారి చెల్లి మాధురి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు మేం ఆ కారుని ఫాలో అవుతున్నాం మీరు త్వరగా రండి అని చెప్తుంది.

జగద్ధాత్రి కంగారు పడి కేథార్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. చెల్లిని కిడ్రాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని కేథార్ అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో మాధురి ఫ్రూట్స్ కావాలి అనడంతో వంశీ టైం అయిపోతుందని తనకు పని ఉందని చెప్పి మాధురిని ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. మాధురి ఫ్రూట్స్ కొనడానికి వెళ్తుంది. అక్కడే ఉన్న హోంమినిస్టర్ తాయారు కొడుకు విక్కీ.. మాధురి మీద కామెంట్స్ చేస్తాడు. మాధురి విక్కీని చెప్పుతో కొట్టడంతో మాధురిని పాడు చేయాలి అని కారులో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. సంధ్య అది చూసి జగద్ధాత్రికి కాల్ చేస్తుంది.

జేడీ, కేడీలు ఇద్దరూ గన్‌లు తీసి ప్రెగ్రెంట్‌తో ఉంది తనకు ఏం కాకూడదు అని బయల్దేరుతారు. రమ్యకి చెప్పి సంధ్య నెంబరుతో లొకేషన్ ట్రేస్ చేస్తారు. రమ్య జగద్ధాత్రికి అడ్రస్ చెప్తుంటుంది. విక్కీ మాధురిని తీసుకొని హోంమినిస్టర్ గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లిపోతాడు. సంధ్య గుర్తు పట్టి ఫోన్ చేయబోతే విక్కీ మనిషి సంధ్య ఫోన్ తీసుకొని స్విఛ్ ఆఫ్ చేస్తాడు. రమ్య జగద్ధాత్రితో సంధ్య ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిపోయిందని దగ్గర్లో హోం మినిస్టర్ గారి గెస్ట్ హౌస్‌ ఉందని చెప్తుంది.

జగద్ధాత్రి మొత్తం గుర్తు చేసుకొని విక్కీ అయ్యుంటాడని అనుకొని గెస్ట్ హౌస్ అడ్రస్ పంపమని చెప్తుంది. సంధ్య గన్ తీసుకొని లొకేషన్‌కి వెళ్తుంది. విక్కీ తన మనుషులతో సంధ్యని పట్టుకోమని చెప్తాడు. ఈ విషయం మా మేడంకి తెలిస్తే నీ పని అయిపోతుంది అని అంటుంది. జేడీకి తెలిస్తే నాకు ఇంకో జన్మ ఉండదా.. ఇప్పుడు నీకు ఈ జన్మ ఉంటుందా అని విక్కీ అంటే సంధ్య ఒక్కటిస్తుంది. విక్కీకి గన్‌ గురిపెట్టి కాల్చేయాలనుకునే టైంకి విక్కీ మనిషి సంధ్య తల మీద కొట్టేస్తాడు. ఇద్దరిలో ముందు ఎవరిని ఎంజాయ్ చేయాలా అని బొమ్మా బొరుసు వేస్తాడు. ముందు సంధ్యతో ఎంజాయ్ చేస్తా అని తన వాళ్లకి చెప్పి సంధ్యని బెడ్ రూంకి తీసుకెళ్లమని అంటాడు.

జేడీ, కేడీలు లొకేషన్‌కి వచ్చేస్తారు. ఇద్దరూ గన్‌లు తీసుకొని వెళ్తారు. జేడీ, కేడీలు డోర్ కొడతారు. దాంతో రౌడీలు విక్కీతో విషయం చెప్తారు. నీకు చావు ఖాయంరా అని సంధ్య అనడంతో ఒక్కటి కొట్టేస్తాడు. సంధ్య పడిపోతుంది. తన మనుషులతో సంధ్య, మాధురి ఇద్దరినీ దాయించేస్తాడు. జేడీ, కేడీలు వచ్చి డోర్ కొడితే ఎందుకు తీయలేదని అడుగుతారు. విక్కీ పిచ్చోడిలా ఆడుకుంటా రండిరా.. అని నాటకం మొదలు పెడతాడు. జగద్ధాత్రి, కేథార్‌లు ఒకమ్మాయిని ఎవరో కిడ్రాప్ చేశార్‌రా మేం వెతకాలి అని అంటే విక్కీ మీరు వెళ్లొద్దు ఇంటికి వెళ్లిపోండి అని చిన్న పిల్లాడిలా మారాం చేస్తే జేడీ, కేడీలు విక్కీని వాయించేస్తారు. నువ్వు ఆడుకోవడానికి ఇంత దూరం రావాలి అనిపించిందా.. నీ తిక్క వేషాలు నా దగ్గర కాదు.. చీరేస్తా అని గెస్ట్ హౌస్ వెతకడానికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.