Jagadhatri Serial Today Episode వైజయంతి శ్రీవల్లికి పాత బట్టలు ఇస్తుంది. ఇదేంటి అని అందరూ అడిగితే పాత బట్టలు కడితేనే అంత జరిగింది కొత్తవి కడితే ఇంకేమైనా ఉందా అని బూచిని ఉద్దేశించి అంటుంది. నన్ను లాగితే బాగోదు అత్తయ్య అని బూచి అంటాడు. శ్రీవల్లికి ప్రాబ్లమ్ లేదు కదా మీకు ఎందుకు పాతవే కట్టుకుంటుంది అని వైజయంతి అంటే వద్దు అని కేథార్ అంటాడు.

శ్రీవల్లి కొత్తవే కట్టుకుంటుంది అని అంటాడు. నువ్వే కొంటావా అని నిషిక అడిగితే ఆల్రెడీ కొనేశాను అని కేథార్ అంటాడు. కేథార్ గదిలోకి వెళ్తే జగద్ధాత్రి వెనకాలే వెళ్తుంది. కేథార్ జగద్ధాత్రితో శ్రీవల్లికి పని మనిషి బట్టలు ఇవ్వడంతో నాకు బాధగా ఉంది అని అంటుంది. దాంతో జగద్ధాత్రి నా భర్త్‌డేకి కొన్ని చీర ఇవ్వాలి అనుకుంటున్నావ్ అంతే కదా.. తన కన్నీరు చూసి నువ్వు తుడవాలి అనుకుంటే నేను ఎందుకు అడ్డుకుంటా అని కేథార్‌కి చీర ఇచ్చి శ్రీవల్లికి ఇవ్వమని అంటుంది. నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం కేథార్ అంటాడు. నువ్వు భర్తగా దొరకడం నా అదృష్టం, శ్రీవల్లికి నీలాంటి అన్నయ్య దొరకడం తన అదృష్టం అని అంటుంది.

కేథార్ ఇక రాడు.. శ్రీవల్లి రేపు ఆ బట్టలు కట్టుకొని కలకల్లాడిపో అంటుంది. కేథార్ వచ్చి తనకి మేం తెచ్చాం ఆ బట్టలేవో మీరే కట్టుకొని కలకల్లాడిపో అని అంటాడు. శ్రీవల్లికి కేథార్ కొత్త బట్టలు ఇచ్చి రేపు మాధురి సీమంతానికి నీకు నీ అన్నవదిన ఇస్తున్నారు ఏం ఆలోచించకుండా తీసుకో అంటాడు. శ్రీవల్లి తీసుకుంటుంది. ఇక కేథార్ పని మనిషి బట్టలు తీసుకొని వైజయంతి వైపు విసిరేస్తాడు. కౌషికి కూడా బట్టలు ఇచ్చి ఈ అక్క కూడా నీకు అండగా ఉంటుంది అని ఇస్తుంది. వైజయంతి శ్రీవల్లి ఆ బట్టలు కట్టుకోకుండా చేయాలి అనుకుంటుంది.

శ్రీవల్లి జగద్ధాత్రి వాళ్ల గదిలో పడుకొని ఉంటే వైజయంతి వెళ్లి శ్రీవల్లి కొత్త చీర చింపేస్తుంది. నేను ఎందుకు ఇలా చేశానో రేపు నీకు తెలుస్తుంది అని అనుకుంటుంది. ఉదయం కేథార్, యువరాజ్ ఇద్దరూ చెరో వైపు చెల్లి సీమంతం పనులను పురమాయిస్తూ బిజీగా ఉంటారు. సుధాకర్ చూసి సంతోషపడతాడు. ఇంతలో వంశీ వాళ్లు యువరాజ్‌ని ఫంక్షన్‌లో ఉండొద్దు అన్న మాట గుర్తు చేసుకొని యువరాజ్‌ని గదిలోకి వెళ్లిపోమని చెప్తాడు. ఏం అవుతుందని నిషిక, వైజయంతి యువరాజ్ ఉండాలని అంటారు. యువరాజ్ లేకపోతే నేను ఉండను అని నిషిక అంటుంది.

జగద్ధాత్రి కూడా నిషికను ఒప్పించే ప్రయత్నం చేస్తే నిషిక జగద్ధాత్రితో యువరాజ్ ఉండకపోతే కేథార్ కూడా ఉండకూడదు అని అంటుంది. కేథార్ ఏం తప్పు చేశాడు అని జగద్ధాత్రి అంటుంది. వాడికేం అర్హత ఉంది అని యువరాజ్ అంటాడు. నేనేం నేరస్తున్ని కాదు అని కేథార్ అంటే అసలు నువ్వు ఇంటికి కూడా ఏం కావు అని యువరాజ్ అంటాడు. సుధాకర్ కోపమై యువరాజ్‌ని లోపలికి పంపిస్తాడు. నా భర్త లేని దగ్గర నేను ఉండను.. ఫంక్షన్ ఎలా చేస్తారో నేను చూస్తా అని నిషిక వెళ్లిపోతుంది.

మాధురి అత్త, భర్తలతో పుట్టింటికి వస్తుంది. కేథార్‌ని ఫంక్షన్లో ఉండొద్దని చెప్పిస్తాను అని అనుకుంటుంది. వంశీతో మీ బావ ఆ రోజు తప్పు చేశాడు ఫంక్షన్‌లో ఉండొద్దని నువ్వు చెప్తే మా ఆయన ఇప్పుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. మరి కేథార్ ఉండొచ్చా.. కేథార్ ఈ ఫ్యామిలీకి ఏం కాడు అని నీకు తెలుసు కదా మరి వాడు ఉండటం ఏంటి ఆలోచించు అని అంటుంది. వంశీ నిషిక మాటలకు కోపంగా ఆలోచిస్తాడు. కేథార్ కాఫీ తీసుకొచ్చి వంశీకి ఇస్తే కింద పడేస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.