Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు బార్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. బార్‌లో కావాలనే యువరాజ్‌ని ఇరికించారని బార్ మేనేజర్ గిరి చెప్పిన తికమక ప్రశ్నలతో కనిపెడతారు. గిరి అబద్ధం చెప్తున్నాడని పొంతన లేని సమాధానాలు చెప్తున్నాయని కేడీ, జేడీ అనుకుంటారు. గిరికి యువరాజ్‌ని ఇరికించాలని అనుకున్నాడని.. మల్లన్న ఇంటికి కూడా గిరి వెళ్లేవాడని అర్థమవుతుంది అందుకే బార్ యజమాని గిరి లైటర్ మల్లన్న ఇంట్లో ఉందని కేడీ అంటాడు.

రమ్య జేడీకి కాల్ చేసి డాక్టర్‌ని ఎంక్వైరీ చేస్తే మల్లన్న భార్య ఇంకెవరినో తీసుకొచ్చిందని ఆయనకు మూతికి దెబ్బ తగిలిందని మందులు ఇచ్చారని చెప్తుంది. మల్లన్న భార్య హాస్పిటల్‌కి తీసుకెళ్లింది బార్ యజమాని గిరిని అని జేడీ, కేడీలకు అర్థమైపోతుంది. ఇక వాళ్లు కొన్నది బట్టలు కాదు సూట్‌ కేసు అని రమ్య చెప్తుంది. జేడీ రమ్యకి మల్లన్న భార్య, గిరి నెంబర్లు ఇస్తుంది. ఇద్దరి కాల్ డేటా చెప్పమని అంటుంది. రమ్య చెక్ చేసి మేనేజర్, మల్లన్న భార్య ఎక్కువ మాట్లాడుకున్నారని అంటుంది. సీసీ టీవీ ఫుటేజ్ దొరికితే యాక్షన్‌లోకి దిగొచ్చని జేడీ అంటుంది.

మీనన్, హోంమినిస్టర్ మాట్లాడుకుంటారు. బార్ మేనేజర్‌తో హోం మినిస్టర్ మాట్లాడాలి అనుకుంటుంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్ జేడీకి రమ్య పంపిస్తుంది. అందులో మల్లన్న భార్య, బార్ మేనేజర్ ఇద్దరూ సూట్‌కేస్‌లో మల్లన్నబాడీని తీసుకెళ్లినట్లు ఉంటుంది. ప్రియుడు, ప్రియురాలు కలిసి మల్లన్నని చంపేశారని యువరాజ్‌ని ఇరికించారని జేడీ అనుకుంటుంది.

మీనన్‌, హోంమినిస్టర్ ఇద్దరూ బార్ మేనేజర్‌కి కాల్ చేసి తమ మీదకు నింద రాకుండా ఉండాలని.. అవసరం అయితే తప్పించుకోమని అంటాడు. జేడీ, కేడీలు వచ్చి గిరితో నువ్వు నీ ప్రియురాలు కలిసి మల్లన్నను చంపేశారని మాకు తెలిసిపోయిందని అంటారు. ఏం ఆధారం ఉందని అడిగితే సూట్‌కేస్ గురించి సీసీ టీవీ ఫుటేజ్‌ గురించి చెప్తారు. గిరి వణికిపోతాడు. ఇంతలో మీనన్‌ మనసులు వస్తే జేడీ, కేడీలు వాళ్లని చితక్కొట్టి గిరిని తీసుకెళ్తారు.

జేడీ, కేడీలు గిరిని ఎంక్వైరీ చేస్తారు. ఎంతకీ గిరి నిజం ఒప్పుకోకపోవడంతో థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారు. చేతులు పచ్చడి చేస్తారు. దాంతో గిరి నిజం చెప్పుకోవడానికి ఒప్పుకుంటాడు. ప్రియకు తనకు అక్రమ సంబంధం ఉందని చెప్తాడు. యువరాజ్‌ మల్లన్న గొడవ తర్వాత ఓ రోజు ప్రియ, గిరి రొమాన్స్ చేసుకుంటే ప్రియ భర్త మల్లన్న తాగి ఇంటికి వస్తాడు. మల్లన్న ప్రియ దగ్గరకు వెళ్తాడు. ప్రియ తోసేస్తుంది. మల్లన్న గిరి లైటర్ చూసి మా మేనేజర్ లైటర్ ఇక్కడ ఉందేంటి.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావే అని గిరి కోసం వెతుకుతాడు. మొత్తం వెతికి గిరిని చూసేస్తాడు. గిరిని చంపేస్తానంటూ మల్లన్న కత్తి తీసుకొని వెళ్తాడు. దాంతో గిరి మల్లన్నని చంపేస్తాడు. తర్వాత అక్రమ సంబంధం కారణంగా ఇద్దరూ కలిసి బాడీని పడేయాలి అనుకుంటారు.

గిరి, ప్రియ రోడ్డు మీద గొడవ పడుతుంటే గిరిని మీనన్ చూస్తాడు. గిరి ద్వారా విషయం తెలుసుకుంటాడు. గిరి మీనన్‌కి యువరాజ్, మల్లన్నల గొడవ తెలిసి మీనన్ సూట్‌కేస్‌లో బాడీ పెట్టి అది యువరాజ్ కారులో పెట్టేయమని మిగతాది నేను చూసుకుంటా అని మీనన్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.