Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యువరాజును వలలో వేసుకోవడానికి ఆఫీసు పనినెపంతో ఇంటికి వచ్చి అతని బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది.కావాలనే యువరాజుపై పడడటంతో ఇద్దరూ బెడ్‌పై పడిపోతారు. అప్పుడే తన రూమ్‌లోకి వచ్చిన నిషిక ఆ సీను చూసి ఇల్లుపీకి పందిరేయడంతో ఈరోజు ఏపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.

వైజయంతిని నిలువరించిన ధాత్రి

చిలకమ్మ పొరపాటున సుధాకర్‌ ఒడిలో పడిపోవడంతో వైజయంతి ఆమెపై మండిపడుతుంది. కొట్టడానికి చేయి పైకి ఎత్తగానే..జగధాత్రి వచ్చి అడ్డుకుంటుంది. మీరు అనవసరంగా ప్రతిదానికీ చిలకమ్మపై కోప్పడుతున్నారని నిలదీస్తుంది. చిలకమ్మ అలాంటిది కాదని నాకు చిన్నప్పటి నుంచి తెలుసునని అంటుంది. ఇంతలో నిషిక కలుగజేసుకుని చిలకమ్మ నీకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసునని అడగ్గా....ఆవేశంలో నాకు తెలుసునని నిజం చెప్పబోతుండగా కేదార్‌ అడ్డుకుని నిలువరిస్తాడు. చాలారోజులుగా తెలుసునని జగధాత్రి చెప్పాలనుకున్నదని అంటాడు. దీంతో జగధాత్రి మాట వెనక్కి తీసుకుంటుంది. ఏదిఏమైనా సరే ఈ చిలకమ్మ ఇంట్లో ఉండటానికి వీళ్లేదని అంటుంది. ఇంతలో సుధాకర్ కల్పించుకుని ఆమె పనిచేస్తున్న చోట నుంచి పని మాన్పించి తీసుకొచ్చమని ఇప్పుడు ఉన్న పళంగా ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా అని అంటాడు. ఏమైనా సరే ఆ చిలకమ్మ ఇంట్లో ఉండటానికి వీళ్లేదని చెప్పి వెళ్లిపోతుంది. నేను అత్తయ్యతో మాట్లాడతానని నిషిక ఆమె వెంటే వెళ్తుంది.ఇప్పుడు చిలకమ్మను పనిలో నుంచి మాన్పించేస్తే ఇంటి పనులన్నీ మనమే చేయాలని అంటుంది. నీకు కూడా నాలా జరిగితే ఆ బాధ తెలుస్తుందని వైజయంతి అంటుంది. యువరాజు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడని నిషిక అనుకుంటుంది.

నిషిక బెడ్‌పై యువరాజు, సోనీ
\యువరాజుతో ఫైల్‌పై సంతకాలు పెట్టించాలంటూ సోనీ నేరుగా ఇంటికి వస్తుంది. ఏకంగా యువరాజు బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోతుంది. చిలకమ్మ ఆమగని చెబుతున్నా వినకుండా వెళ్లిపోతుంటే కేదార్, జగధాత్రి ఎవరని అడుగుతారు. ఎవరో అమ్మాయి యువరాజు గదిలోకి వెళ్లిందని చెబుతుంది.ఇప్పుడు అసలే నిషిక లేదని వచ్చిందంటే ఇల్లుపీకి పందిరి వేస్తుందని అంటుండగానే నిషిక వచ్చి ఏమైందని నిలదీస్తుంది. యువరాజు గదిలోకి అమ్మాయి వెళ్లిందని చెప్పడంతో కోపంతో నిషిక మేడపైకి వెళ్తుంది.అప్పుడే యువరాజుతో సంతకం పెట్టించేనెపంతో బొద్దింకను చూసి భయపడినట్లు నటించి సోనీ యువరాజుపై పడిపోతుంది.దీంతో ఇద్దరూ కలిసి బెడ్‌పై పడిపోతారు.అప్పుడే నిషిక తలుపు తీసుకుని లోపలికి వస్తుంది. తన బెడ్‌పై మరో అమ్మాయితో యువరాజు ఉండటం చూసి నిషికకు కోపం కట్టలు తెంచుకుంటుంది..

సోనీనీ కత్తితో పొడవబోయిన నిషిక

తన భర్తతో బెడ్‌రూమ్‌లో సోనీని చూసిన నిషిక కోపంతో ఆమె చెంపలు పగులగొడుతుంది.ఆవేశంతో కత్తి తీసుకుని ఆమెను చంపడానికి వెంటపడుతుంది. ఇంతలో భయంతో సోనీ కిందకు పరుగులు తీస్తుంది.ఆమె వెంటే నిషిక కూడా కత్తి తీసుకుని వెంటపడుతుంది.సోనీ భయంతో అరుస్తూ ఇళ్లంతా పరుగులు తీస్తుంది. ఎవరు ఆగమన్నా నిషిక అగకపోవడంతో జగధాత్రి ఆమెను పట్టుకుని చేతిలో కత్తి లాక్కుంటుంది. ఏదైనా తప్పు జరిగితే కూర్చుని మాట్లాడుకోవాలని జగధాత్రి నిషికకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. సుధాకర్ కూడా నిషికను తిట్టి సోనీకి సారీ చెప్పమంటాడు. ఇందులో నా తప్పు ఏంలేదని నేను క్షమాపణలు చెప్పనని అంటుంది.మరోసారి నా భర్త దగ్గర ఆ సోనీని చూశానంటే నిజంగానే చంపేస్తానని ఆ విషయం వాళ్లిద్దరికీ అర్థమయ్యేట్లు చెప్పండని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో సోనీ వెళ్లిపోగా....జగధాత్రి నిషిక దగ్గరకు వెళ్లి ఆమెకు నచ్చజెబుతుంది. బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన విషయాలు నలుగురిలో పెట్టకోవద్దని చెప్పి వెళ్లిపోతుంది.