Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. శ్రీవల్లి వ్యవహారం ఎప్పటికైనా బావకు తెలిసిపోతుందని...వైజయంతి భయపడిపోగా తనను ఇంటి నుంచి తాను తీసుకెళ్తానంటూ పాపారాయుడు కొత్త నాటకం ఆడతాడు. సేసేమీరా ఇంటి నుంచి బయటకు రానని శ్రీవల్లి చెప్పడంతో జగధాత్రి,కేదార్ ఆమెకు అండగా నిలవడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
రాయుడికి తెలిసిపోయిన నిజం
గంట క్రితం వరకు చంపడానికి ప్రయత్నించిన పాపారాయుడు మామయ్య ఇప్పుడు సడెన్‌గా ఎందుకు మారిపోయాడని యువరాజు వాళ్ల అమ్మను అడుగుతాడు. నేనే మామయ్యకు నిజం చెప్పేశానని అంటుంది. శ్రీవల్లి ఆ సుహాసిని కూతురని చెప్పేశానని అంటుంది. మరి ఆయన ఎలా నమ్మారంటే....సుహాసిని చనిపోయే ముందు గర్భవతి అని మీమామయ్యకు కూడా తెలుసునని అందుకే నమ్మారని చెబుతుంది. ఏదైనా మీమామ మారిపోవడం మనకు మంచిదేనని మిగిలిన విషయాలు ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని అంటుంది. అటు కేదార్‌, జగధాత్రికి కూడా రాయుడు మామయ్యలో వచ్చిన మార్పు అర్థంగాక తలలు పట్టుకుంటారు. ఖచ్చితంగా అత్తయ్యగారు బాబాయికి ఏదో చెప్పారని..లేకపోతే ఆయన అంతలా మారిపోరని అంటుంది.నిషిక కూడా శ్రీవల్లి గురించి యువరాజు ఏదో చెప్పబోతుంటే ఆపిందని అంటుంది.ఇదంతా చూస్తుంటే ఏదో విషయం మన దగ్గర దాస్తున్నారని జగధాత్రి అంటుంది.ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుందామంటూ ఆస్పత్రి బిల్లు కట్టేసి వెళ్లిపోతారు.
పాపారాయుడి కొత్త ఎత్తులు
ఇంటికి వెళ్లిన వెంటనే కౌషికి పాపారాయుడిని ప్రశ్నిస్తుంది. అసలు మీ మాటలు ఎలా నమ్మాలని అంటుంది. నాకు నిజంగా బుద్ధి వచ్చిందని అందుకే మారిపోయానని అంటాడు. మా చెల్లి ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకున్నానని అంటాడు. ఇలా నాటకం ఆడి మళ్లీ ఎవరూ లేనప్పుడు దాన్ని చంపుదామని చూస్తున్నావా అని సుధాకర్ అంటాడు. జగధాత్రి కల్పించుకుని మీకు ఏదో నిజం తెలిసిందని అంటున్నారు కదా ఏంటా నిజమని అడుగుతుంది. మీరు సడెన్‌గా మారిపోవడానికి కారణమైన ఆ నిజం ఏంటో అందరికీ చెబితే...మీరు నిజంగా మారిపోయారో లేదో మేం కూడా నమ్ముతామని అంటుంది. నిషిక కలుగజేసుకుని మా ఇంటి విషయాల్లో మీ జోక్యం అవసరం లేదని అంటుంది. బాబాయి మారిపోయాడని మేం నమ్ముతున్నామని ఇక ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదని ఆయన్ను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది.
అసలు మీ ఇంట్లో వాళ్ల పెత్తనం ఏంటని రాయుడు యువరాజును అడుగుతాడు. ఆ జగధాత్రి వల్లే ఇదంతా జరిగిందని నిషిక చెబుతుంది. ఆ శ్రీవల్లిని ఎన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించినా అది అడ్డుపడుతుందని చెబుతుంది. అయితే ఈసారి నేను ప్లాన్ చేస్తానని చెప్పి....మీరు కింద ఉండండని చెప్పి శ్రీవల్లి గదిలోకి వెళ్తాడు. శ్రీవల్లి బ్యాగ్‌ తీసుకుని కిందకు వస్తాడు. మీరు వచ్చేప్పుడు బ్యాగ్ తీసుకుని రాలేదు కదా ఇప్పుడు ఇదేంటనని జగధాత్రి అడుగుతుంది. ఆ బ్యాగ్ నాదని శ్రీవల్లి చెప్పగా....నా మేనకోడలిని మా ఇంటికి తీసుకెళ్లి నా కూతురిలా చూసుకుంటానని అంటాడు.దీంతో భయపడిపోయిన శ్రీవల్లి నేను రానని ఇక్కడే ఉంటానని ఏడుస్తుంది. నాకు బిడ్డలు లేరని నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటానని చెప్పినా వినకుండా పైకి పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. జగధాత్రి, కేదార్ వెళ్లి ఆమెతో మాట్లాడగా....తాను వెళ్లనంటే వెళ్లనని చెబుతుంది.ఇదంతా చూస్తుంటే పాపారాయుడు బాబాయి అత్తయ్య వాళ్లు కలిసి శ్రీవల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ఏదో ప్లాన్ చేశారని జగధాత్రి అనడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.