Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. ఆస్పత్రిలో ప్రాణాలతో బయటపడిన వైజయంతిని చంపడానికి మళ్లీ వచ్చిన పాపారాయుడికి ఆ శ్రీవల్లి తన కూతురు కాదని.. సుహాసిని కూతురని చెప్పేస్తుంది. ఆమె కేదార్ చెల్లి అని తెలిస్తే మా ఆయన నన్ను బతకనివ్వడనే అబద్ధం చెప్పానని అంటుంది. దీంతో చెల్లిపై పాపారాయుడు ప్రేమ కురిపిస్తుండటంతో జగధాత్రికి అనుమానం రావడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
నోరు జారిన యువరాజు
పెళ్లికి ముందే బిడ్డను కన్న మా చెల్లి నా పరువుతీసిందని అందుకే చంపి తీరతానని పాపారాయుడు అంటాడు.తన తల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్న మేనమామ చొక్కా పట్టుకుని యువరాజు నిలదీస్తాడు. మా అమ్మగురించి ఇంకో మాట మాట్లాడవంటే సహించేదిలేదని వార్నింగ్ ఇస్తాడు.దీంతో పాపారాయుడికి కూడా కోపం వచ్చి నా పరువు తీసిన నీ తల్లిని నువ్వు క్షమిస్తావు గానీ...నేను మాత్రం వదిలిపెట్టేది లేదని అంటాడు.దీంతో యువరాజు అసలు శ్రీవల్లి మా అమ్మ కూతురే కాదని చెబుతాడు. అసలు ఆ అమ్మాయి మా అమ్మకు పుట్టలేదని చెబుతాడు.దీంతో జగధాత్రి కల్పించుకుని మరి శ్రీవల్లి ఎవరి కూతురని నిలదీస్తుంది.మీ అమ్మ కూతురు కాదని నువ్వు చెబుతున్నావంటే అసలు నిజం నీకు తెలుసునని అడుగుతుంది.ఇంతలో నిషిక యువరాజును ఆపమని చెప్పడంతో తను వెనక్కి తగ్గుతాడు.వాళ్ల అమ్మ గురించి చెడుగా మాట్లాడటంతో తట్టుకోలేక యువరాజు అలా చెప్పాడని నిషిక సర్దిచెబుతుంది.
మరోసారి వైజయంతిపై దాడికి యత్నం
డాక్టర్‌ వచ్చి వైజయంతి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని....స్కానింగ్ తీయించిన తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తన చెల్లి మళ్లీ బతికిపోయిందని పాపారాయుడు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్కానింగ్‌కు తీసుకెళ్తున్న నర్సును బెదిరించి వైజయంతిని ఓ రూమ్‌లోకి తీసుకెళ్లిపోతాడు. పాపారాయుడు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన కేదార్‌, జగధాత్రి...తాము పిన్ని పక్కనే ఉంటామంటూ వెళ్తారు.వాళ్లు ఊహించినట్లే వైజయంతి కనిపించకపోవడంతో కంగారుతో ఆస్పత్రి మొత్తం వెతుకుతుంటారు. ఇంతలో పాపారాయుడు కత్తెరతో వైజయంతిని చంపడానికి ప్రయత్నిస్తుండగా ఆమెకు మెలకువ వస్తుంది. తనను చంపోద్దని బ్రతిమలాడుతుంది. అయినా సరే పాపారాయుడు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుండగా కత్తెర లాక్కుని నేను చెప్పేది ఒకసారి వినమని గట్టిగా అరుస్తుంది.
శ్రీవల్లి కేదార్‌ చెల్లెలే
అసలు ఆ శ్రీవల్లి నా కూతురే కాదని వైజయంతి వాళ్ల అన్నయ్యకు చెప్పేస్తుంది. అసలు తను నాకు పుట్టలేదని అంటుంది. దీంతో మరి ఆ అమ్మి ఎవరని నిలదీస్తాడు. సుహాసిని కూతురని చెప్పడంతో పాపారాయుడు షాక్ తింటాడు. మా ఆయనకు సుహాసినికి పుట్టిన కూతురని....కేదార్‌కు చెల్లెలు అని చెప్పడంతో పాపారాయుడి మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. కొడుకు దూరమైతే ఊరుకున్న మా ఆయన...కూతురుని మనమే దూరం చేశామని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడని అంటుంది. నా కొడుకుకి ఆస్తి మొత్తం దక్కాలంటే ఆ అమ్మాయి జన్మ రహస్యం ఎవరికీ తెలియకూడదని నా కూతురని అబద్ధం చెప్పానని అంటుంది. ఇది తెలుసుకున్న పాపారాయుడు....నేను చాలా పెద్ద తప్పు చేశానని క్షమించమని అడుగుతాడు.ఇంతలో అక్కడికి జగధాత్రి వస్తుంది...మా పిన్నిని ఏం చేయవద్దని హెచ్చరిస్తుంది.అందరూ అక్కడికి వచ్చి పాపారాయుడిని తిడతారు.
సడెన్‌గా మారిపోయిన పాపారాయుడు
అందరికీ పాపారాయుడు క్షమాపణలు చెబుతాడు. మా చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్నానని ఆవేశంలో చేయరాని నేరం చేశానని అంటాడు. మా చెల్లి ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని అంటాడు. సడెన్‌గా పాపారాయుడు మారిపోవడంతో జగధాత్రికి అనుమానం వస్తుంది.నిన్న కూడా ఇలా నమ్మించే మా పిన్ని ప్రాణాలు తీయాలని చూశావని కేదార్ అంటాడు.ఇప్పుడు నిజంగానే మారిపోయానని చెప్పడంతో ధాత్రికి ఏం అర్థం కాదు.ఎందుకు ఇలా మారిపోయారని అడిగితే...మా అన్న మారిపోయాడని నేను నమ్ముతున్నానని అది చాలని వైజయంతి అంటుంది. దీనివెనక ఏదో ఉందని జగధాత్రి అనుమానిస్తుంది.