Jagadhatri  Serial Today Episode  కారు దగ్గరకు వెళ్లిన ధాత్రి, కేదార్‌.. కౌషికిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన కౌషికి ఆందోళన పడుతుంది. మామయ్య నన్ను చంపాలనుకుంటున్నాడు. ఆ డ్రైవర్‌ను నా కళ్ల ముందే చంపాడు కానీ మళ్లీ ఎలా బతికి వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్తుంది. బాబాయ్‌ నన్ను నమ్మండి అంటుంది.

సుధాకర్‌: నాక్కూడా నీ మాటలు నమ్మాలని ఉందమ్మా కౌషికి కానీ చనిపోయిన మనిషి వచ్చి నిన్ను చంపాలనుకోవడం ఏంటో అర్థం కావడం లేదు.

ధాత్రి: వదిన మీరు చెప్పింది నిజమని మేము ముగ్గురం నమ్ముతున్నాం. కానీ జరిగిన దానికి మన కళ్ల ముందు జరుగుతున్న దానికి తేడా కనిపెడితే ఈ కన్పీజన్‌కు క్లారిటీ వస్తుంది.

కేదార్‌: అక్కా అది కనిపెట్టే వరకు మీరు ఒక్కరే బయటకు వెళ్లకండి..

సుధాకర్‌: అవునమ్మా కౌషికి కొద్ది రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు.

నిషిక: మాకు కావాల్సింది అదే కదా..? ( మనసులో అనుకుంటుంది)

కౌషికి: నేను కళ్లతో చూసింది నిజం కాకపోవడం. కళ్లముందు కనిపిస్తున్న నిజం అబద్దం అవడం.. అది మీ ఎవరికీ నేను నిరూపించకపోవడం ఏం జరుగుతుందో నాకేమీ అర్తం కావడం లేదు బాబాయ్‌.

ధాత్రి: వదిన ముందు మీరు కంగారు పడకండి.. అసలు ఏం జరగుతుందో కనిపెడదాం. మేముండగా మీకు ఏమీ కాదు.

కేదార్‌: అవునక్కా మేము ఉండగా నీకేమీ కాదు. కానివ్వం..

సుధాకర్‌: అమ్మా జగధాత్రి.. కౌషికిని లోపలికి తీసుకెళ్లు..

ధాత్రి: సరే మామయ్య గారు.. రండి వదిన

అంటూ కౌషికిని తీసుకుని లోపలికి వెళ్తుంది. మరోవైపు మీనన్‌.. మంత్రిని కలుస్తాడు. మంత్రి హ్యాపీగా చెప్పినట్టే చేశావు భాయ్‌ అంటాడు. ఇద్దరూ కలిసి మందు కొడుతారు.

మంత్రి: చెప్పినట్టే చేసి చూపెట్టావు. థాంక్యూ మీనన్‌ భాయ్‌.. 20 ఏళ్ల దూరాన్ని గుర్తు పెట్టుకోకుండా అంతకుముందు ఉన్న మన స్నేహాన్ని గుర్తు పెట్టుకుని అడగ్గానే సాయం చేశావు. ఆఖరి నిమిషంలో వచ్చి నన్ను చాలా పెద్ద సమస్య నుంచి బయట పడేశావు.

మీనన్‌: అయినా మనిషికి తెలియకుండా ప్రాణాలు తీసే నువ్వు ఇలాంటి కేసులో ఎలా ఇరుక్కున్నావు కేశవ.

మంత్రి: ఇదిగో ఇలాంటి చెత్త వెధవలను పక్కన పెట్టుకున్నందుకు జరిగిన తప్పు భాయ్‌ ఇదంతా..

అభి: చంపమన్నది నువ్వే కదా బావ

మంత్రి: చంపమంటే.. ప్రపంచం అంతా చూసేలా చేయమని కాదు. నేరం చేయడానికి వెళ్లి ఆధారాలు అక్కడ వదిలేసి వచ్చావు. మీనన్‌ భాయ్‌ కాపాడకపోతే నేను కూడా నీతో పాటు పక్క సెల్‌ లో ఉండేవాణ్ని..

మీనన్‌: వీణ్ని బయట తిరగనివ్వకు.. కేసు గొడవ తేలే వరకు అండర్‌ గ్రౌండ్‌లో ఉంచు..

మంత్రి: సరే భాయ్‌.. ఆ జేడీని కూడా ఏదో ఒకటి చేయాలి..

అవును ఇద్దరం కలిసినప్పుడు తప్పకుండా గెలిచాం మళ్లీ ఇప్పుడు కూడా కలిశాం కదా.. తప్పకుండా గెలుస్తాం అంటాడు మీనన్‌. మరోవైపు రూంలో ఒంటరిగా కూర్చున్న కౌషికి తనను చంపడానికి పరంధామయ్య వచ్చినట్టు భ్రమ పడుతూ భయపడుతుంది. గట్టిగా అరుస్తుంది. బయటి నుంచి అరుపులు విన్న ధాత్రి, కేదార్‌ కౌషికి రూంలోకి పరుగెత్తుకెళ్తారు. అక్కడ కౌషికి కింద పడిపోయి ఉండటం చూసి షాక్‌ అవుతారు. కౌషికిని తీసుకెళ్లి ఓదార్చి పడుకోబెడతారు.

ధాత్రి: వాళ్లకు కావాల్సింది వదినను అందిరి ముందు పిచ్చిదాన్ని చేయడం. ఆస్థి కొట్టేయడం.. మనల్ని బయటకు గెంటేయడం.. ముందు ఇదంతా నిషిక వాళ్ల నాటకమేనన్న క్లారిటీ రావాలి.

కేదార్‌: వాళ్ల నోటితోనే నిజాన్ని బయటకు రప్పించాలి.

అని కేదార్‌ అనగానే ధాత్రి తన కొచ్చిన ఐడియా చెప్తుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ వైజయంతి దగ్గరకు వెళ్లి నిషి నగలు పోయాయని చెప్తారు. అందరూ షాక్‌ అవుతారు.

కాచి: ఏంటి నిషి నగలు పోయాయా..?

కేదార్‌: అవును పరంధామయ్య మామయ్య లాగా ఒక వ్యక్తి వచ్చి నగలు ఎత్తుకెళ్లడం మేము చూశాము..

అని చెప్పగానే నిషిక లోపలికి వెళ్లి నగలు చూస్తుంది అక్కడ నగలు కనిపించవు. దీంతో కంగారుగా బయటకు వచ్చిన నిషిక.. యువరాజ్‌కు తన నగలు కనిపించడం లేదని చెప్తుంది. దీంతో వైజయంతి బాధపడుతూ నా నగలు అన్ని కూడా పోయాయా..? అంటూ ఇదంతా ఆ దొంగ నాయాలా పని అనుకుంటా.. వాణ్ని వెంటనే పోలీసులకు పట్టించి మన నగలు అంటూ ధాత్రి, కేదార్‌ లను చూసి ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!