కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)లో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు... దర్శకుడు, నిర్మాత కూడా ఉన్నారు. 'పా పాండి'తో ఆయన మెగాఫోన్ పట్టారు. ఇక, గత ఏడాది తీసిన 'రాయన్'తో సక్సెస్ అందుకున్నారు ధనుష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'నిళవక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్'. తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా'గా విడుదల కానుంది. ఈ సినిమాను దర్శకుడు - నటుడు ఎస్.జె. సూర్య చూశారు. ఆయన ఏమన్నారో తెలుసా?

జెన్ జెడ్ యూనిక్ మూవీ...
ధనుష్ డైరెక్షన్ ఉంది చూశారూ!
తెలుగు, తమిళ భాషల్లో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది. అయితే... ఎస్.జె. సూర్య కోసం స్పెషల్ షో వేశారు ధనుష్. ఆయన దర్శకత్వం వహించిన 'రాయన్'లో సూర్య విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. షో పూర్తి అయ్యాక ధనుష్ దర్శకత్వం మీద, సినిమా మీద ఎస్.జె. సూర్య ప్రశంసల వర్షం కురిపించారు.

''మన ఇంటర్నేషనల్ యాక్టర్, డైరెక్టర్ ధనుష్ గారితో కలిసి 'నీక్' (NEEK Movie - Nilavuku En Mel Ennadi Kobam) చూసే అదృష్టం కలిగింది. సినిమా భలే ఎంటర్‌టైన్ చేసింది. ఇదొక యంగ్ జెన్ జెడ్, ఫన్ సినిమా. అదే సమయంలో ఎమోషనల్‌గానూ ఉంది. యూనిక్‌గా ఉంది'' అని ఎస్.జె. సూర్య తెలిపారు.

ధనుష్ గారూ... ఒక్క ప్రశ్న అంటూ ఎస్.జె. సూర్య కంటిన్యూ చేశారు. ''రాయన్' తీసిన వెంటనే క్షణం తీరిక లేని షెడ్యూళ్లలో ఇటువంటి ఒక చక్కటి బ్రిజీ సినిమా ఎలా తీశారు?'' అని సూర్య ప్రశ్నించారు. ధనుష్ దర్శకత్వం బావుందని చెప్పడంతో పాటు సినిమాలో నటీనటులు అందరికీ కంగ్రాట్స్ చెప్పారు.

Also Read: రాజా వారు రాణి గారు... తల్లిదండ్రులు కాబోతున్నారు - గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం

Had the privilege to watch #NEEK with our international actor, director @dhanushkraja sir 🥰🥰🥰 what a entertaining, young GenZ, Fun , yet emotional, yet unique Movie it is 🥰🤣🔥😉🫡 Sir one question, how U r able to make such breezy movie in these tight schedules that too…

— S J Suryah (@iam_SJSuryah) January 20, 2025

'జాబిలమ్మ నీకు అంత కోపమా' (తమిళంలో 'నిళవక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్') సినిమాను ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థతో క‌లిసి ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్‌ బార్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇదొక రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ క‌థ‌తో కూడిన సినిమా. తెలుగు వెర్ష‌న్‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విడుద‌ల చేస్తోంది. 'రాయన్' తర్వాత మరోసారి ధ‌నుష్ దర్శకత్వం వహించిన సినిమాను ఆ సంస్థ తెలుగులో విడుద‌ల చేస్తోంది.

'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాలో ప‌వీష్‌, అనిఖా సురేంద్ర‌న్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మాథ్యూ థామ‌స్‌, వెంక‌టేష్ మీన‌న్‌, ర‌బియా ఖ‌తూన్‌, ర‌మ్యా రంగ‌నాథ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోహించారు. ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించగా... ఒక ప్రత్యేక గీతంలో ప్రియాంకా అరుల్ మోహన్ సందడి చేయనున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌: లియోన్ బ్రిట్టో, ఎడిట‌ర్‌: జి.కె.ప్ర‌స‌న్న.

Also Read: టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఫస్ట్ ప్లేస్ ఎవరిది? టాప్ 10లో ఏవేవి ఉన్నాయో తెలుసా?