ఓంకార్ (Ohmkar)... ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయనలో నటుడు ఉన్నాడు, దర్శక నిర్మాత కూడా ఉన్నాడు, అలాగే ఒక షో హోస్ట్ సైతం ఉన్నాడు. టీవీ షోలతో పాటు సినిమాలూ ఆయన చేశారు. ఓంకార్ పేరు బ్రాండ్ కావడం వెనుక ఆ హోస్ట్ మేజర్ రోల్ ప్లే చేశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు ఓంకార్ చేస్తున్న షో ఏదో తెలుసా? 'ఇస్మార్ట్ జోడి' సీజన్ 3 (iShmart Jodi Season 3).

బిగ్ బాస్ ప్లేసులో ఇస్మార్ట్ జోడి!
టీవీ సీరియళ్లు కావచ్చు, రియాల్టీ షోలు కావచ్చు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కావచ్చు... బుల్లితెరపై 'స్టార్ మా' ఛానల్ తన సత్తా చాటుతోంది.‌‌ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో దూసుకు వెళ్తోంది. 'స్టార్ మా'కు హయ్యస్ట్ టీఆర్పీ సాధించిన కార్యక్రమాలలో 'బిగ్ బాస్' కూడా ఒకటి.

ఇటీవల 'బిగ్ బాస్' సీజన్ 8 ముగిసింది. ఆ టైమ్ స్లాట్ తీసుకుంది 'ఇస్మార్ట్ జోడి సీజన్ 3'. ఫస్ట్ వీక్ ఈ కార్యక్రమానికి వీక్షకుల నుంచి స్పందన ఎలా ఉంది? టీవీల్లో ఎంత మంది ఈ కార్యక్రమాన్ని చూశారు? అనే విషయాలు చూడాలంటే టీఆర్పీ ఒక ప్రామాణికం అని చెప్పాలి.

'ఇస్మార్ట్ జోడి సీజన్ 3' లాంచింగ్ వీక్ టీఆర్పీ 6.33. ఒక విధంగా ఇది చాలా మంచి టీఆర్పీ. ప్రతి రోజు టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్ విషయానికి వస్తే... దాదాపు ప్రతి వారం 'కార్తీక దీపం 2' టాప్ ప్లేస్ లో ఉంటుంది. దానికి తొమ్మిది నుంచి పది వరకు టీఆర్పీ వస్తుంది.‌ మిగతా సీరియల్స్ టీఆర్పీ ఎనిమిదికి అటు ఇటుగా ఉంటుంది. ఆ లెక్కన లాంచింగ్ వీక్ 'ఇస్మార్ట్ జోడి సీజన్ 3' మంచి టీఆర్పీ అందుకుంది. షో ముందుకు వెళ్లే కొలది టీఆర్పీ పెరిగే అవకాశం ఉంది.

Also Read: టీఆర్పీలో మళ్లీ కార్తీక దీపం రికార్డ్ - టాప్ 6లో అన్నీ 'స్టార్ మా' సీరియళ్ళే - ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?

బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే టీఆర్పీ 12.93. ఆ‌ షో లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ 18.9. కింగ్ నాగార్జున హోస్ట్ చేయడంతో పాటు ఆ కార్యక్రమంలో సెలబ్రిటీలు ఎంతో మంది పాల్గొన్నారు. బిగ్ బాస్ షోతో కంపేర్ చేస్తే... ఇస్మార్ట్ జోడి సీజన్ 3 బడ్జెట్ తక్కువ. ఇందులో సెలబ్రిటీలు తక్కువ. ఎక్కువ మంది ఆల్రెడీ బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. కేవలం ఓంకార్ బ్రాండ్ ఇమేజ్ మీద ఈ షో రన్ అవుతుంది.

ప్రతి శని, ఆది వారాలలో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే 'ఇస్మార్ట్ జోడి సీజన్ 3'లో 'రాకింగ్' రాకేష్ - జోర్దార్ సుజాత, అమర్ దీప్ చౌదరి - తేజస్విని గౌడ, యాంకర్ లాస్యతో పాటు ఆయన భర్త, అలీ రెజాతో పాటు ఆయన భార్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Also Read: గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ హైలైట్స్... రామ్‌ చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 విడుదలపై చరణ్ హంగామా