Samuthirakhani's Isakapatnam Trailer Review : ప్రముఖ డైరెక్టర్, నటుడు సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ తండ్రీ కూతుళ్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన రివేంజ్ క్రైమ్ డ్రామా సిరీస్ ఇసకపట్నం (Isakapatnam). కల్పిత పోర్ట్ టౌన్‌లో ఆధిపత్యం కోసం సాగే పోరాటం నేపథ్యంలో రూపొందించిన ఈ సిరీస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఫస్ట్ ట్రైలర్ తండ్రీ కూతుళ్ల మధ్య రివేంజ్ డ్రామా ప్రధానాంశంగా చూపించగా... తాజా ట్రైలర్‌‍లో అసలు తండ్రిపై కూతురు ఎందుకు పగ పెంచుకుంది. తండ్రి నుంచి డబ్బు, పవర్ తీసుకునేందుకు కూతురు ఏం చేసింది? అనేది చూపించారు. 'ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు. చచ్చేంత పని చేస్తే చాలు.' అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు తండ్రీ కూతుళ్లు మధ్య వార్ ఎందుకు? అనేది తెలియాలంటే సిరీస్ స్ట్రీమ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Also Read : Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్‌లో సముద్రఖని (Samuthirakhani) నాయుడు పాత్రలో, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) భారతి పాత్రలో నటించారు. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాల్‌గా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన 7 ఎపిసోడ్‌ల సిరీస్‌కు ప్రశాంత్ రాఘతి స్టోరీ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ రాశారు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) జులై 2 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

Also Read : Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.