Is crying Good or Bad For Mental Health: సమాజంలో "మగవాళ్లు ఏడవకూడదు" అనే స్టీరియోటైప్ బలంగా నాటుకుపోయింది. మగవాళ్లు భావోద్వేగాలను బయటపెట్టకుండా ఉండటం మంచిదా లేదా చెడ్డదా? ఈ అంశం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక ప్రశ్న. ఇటీవలి పరిశోధనలు, మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఈ స్టీరియోటైప్ వల్ల పురుషులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, సూసైడ్ రేట్లు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని చూపిస్తున్నాయి. ఈ ఆర్టికల్‌లో వివిధ స్టడీలు, నిపుణుల దృక్పథాలతో ఈ విషయాన్ని విశ్లేషిస్తాం. పురుషులు ఏడవకపోవడం సొసైటీ ఒత్తిడి వల్లనే అని అనేక స్టడీలు చూపిస్తున్నాయి. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) పరిశోధన ప్రకారం, మహిళలు నెలకు సగటున 5.3 సార్లు ఏడుస్తారు, అయితే పురుషులు 1.3 సార్లు మాత్రమే ఎడుస్తుంటారు. ఈ వ్యత్యాసం పూర్తిగా సామాజిక కండిషనింగ్ వల్లనే అని నిపుణులు వివరించారు.

"పురుషుడు దృఢమైన వ్యక్తి- ఏడవడు" - హానికరమైన సంస్కృతి

భారతీయ సంస్కృతిలో "పురుషుడు దృఢమైన వ్యక్తి దేనికీ భయపడకూడదు" అనే విధానం పురుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా చాపెల్ హిల్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ విజ్‌డమ్ పావెల్ వివరించారు. వారు చేసిన అధ్యయనంలో, పురుషులు ఇలాంటి కఠినమైన గోడలు కట్టుకోవడం వల్ల వారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేలింది. సౌత్ ఏషియన్ పురుషుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. అబ్బాయిలు ఏడవరు అనే వాక్యాలు బాల్యం నుంచే వినిపిస్తుంటాయని కెనడాకు చెందిన రిజిస్టర్డ్ క్లినికల్ సోషల్ వర్కర్ జాస్ హుందల్ వివరించారు.

భావోద్వేగాలను అణచివేయడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని APA హెచ్చరిస్తుంది. మానసిక శాస్త్రవేత్త విలియం ఫ్రే పరిశోధనలో, పురుషులు "స్టాయిక్"గా ఉండాలనే సమాజ ఒత్తిడి వల్ల ఏడవడం తగ్గించేస్తారని తేలింది . సైకలాజికల్‌గా, "మెన్ డోంట్ క్రై" స్టీరియోటైప్ వల్ల పురుషులు బలహీనులుగా కనిపించకూడదని భావిస్తారు. సెంటర్ ఫర్ రిలేషన్‌షిప్ హెల్త్ (CRSH) పరిశోధన ప్రకారం, పురుషులు పీర్ జడ్జ్‌మెంట్ భయంతో భావాలను దాచుకుంటారు.

పురుషులు భావాలను అణచివేయడం వల్ల డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. ఇన్‌సైట్ కౌన్సెలింగ్ స్టడీలో, "బాయ్స్ డోంట్ క్రై" స్టీరియోటైప్ వల్ల పురుషులు "మ్యాన్ అప్" అని భావించి, భావోద్వేగాలను అణచుకుంటారు, ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. డచ్ అడోలెసెంట్స్ స్టడీలో, పురుషులు భావోద్వేగాలను దాచుకోవడం వల్ల రిలేషన్‌షిప్ క్వాలిటీ దెబ్బతింటుంది. యూనియన్ స్ట్రీట్ జర్నల్ స్టడీ ప్రకారం, పురుషులు ఏడవకపోవడం వల్ల సెల్ఫ్-డిస్ట్రక్టివ్ బిహేవియర్ అంటే వారిలో వయోలెన్స్ పెరుగుతుంది, మాదక ద్రవ్యాలవైపు దృష్టి పెడతారు. ఇది మరణాలకు దారితీస్తుంది.

హార్మోన్ల వ్యత్యాసాలు, న్యూరో సైంటిఫిక్‌ కారణాలు

టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏడవడాన్ని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అదే సమయంలో ప్రోలాక్టిన్ హార్మోన్ ఏడవడాన్ని ప్రేరేపిస్తుంది, ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. న్యూరాలజికల్ దృష్టితో చూస్తే, పురుషులు భావోద్వేగాలను ప్రాసెస్ చేసేటప్పుడు లింబిక్ సిస్టమ్ కంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల వారు భావోద్వేగాలను వ్యక్తపరిచడంలో కంటే వాటిని విశ్లేషణాత్మకంగా చూడటంలో ముందు ఉంటారు.

ఏడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

హార్వర్డ్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. పురుషుల్లో ఇలాంటివి తక్కువగా ఉంటాయి. అందుకే వారిలో సహజంగా ఏర్పడే రోగనిరోధక శక్తిని అడ్డుకుంటాయి. భావోద్వేగాలను దాచుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

పీఎంసీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఏడవడం వల్ల పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ పెరుగుతుంది, ఇది హోమియోస్టాసిస్ ప్రాసెస్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కార్టిసాల్ లెవెల్స్ తగ్గించడంలో ఏడవడం సహాయపడుతుంది.

కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్‌లో చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన వాస్తవం వెల్లడైంది. పురుషులు స్టీరియోటైపికల్ మాస్క్యులిన్ కాంటెక్స్ట్‌లలో అంటే ఆటల్లో ఓడిపోయినప్పుడు ఏడవడం లాంటిది. వీటి వల్ల వారి పట్ల సానుకూలంగా ప్రభావం వస్తుందని తేలింది. వెయిట్‌లిఫ్టింగ్ కంటెస్ట్‌లో ఓడిపోయిన పురుషుడు ఏడ్చితే చిన్న విషయంగా కనిపిస్తుంది. అదే గ్రూప్ గేమ్‌లలో ఏడిస్తే మాత్రం పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, భారతీయ పురుషులలో రెస్ట్రిక్టివ్ ఎమోషనాలిటీ అధికంగా ఉంది. దీని వల్ల వాళ్లు భావోద్వేగాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. అరిజోనా యూనివర్సిటీ ఎల్లర్ కాలేజ్ పరిశోధకులు జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీలో ప్రచురించిన అధ్యయనంలో 169 మందితో చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలువడ్డాయి. పనిలో పనితీరు మూల్యాంకన సమయంలో ఏడ్చిన పురుషులను అటిపికల్‌గా చూస్తున్నట్లు తేలింది. వారికి తక్కువ పరఫార్మెన్స్ ఎవాల్యుయేషన్లు, లీడర్‌షిప్ అసెస్‌మెంట్లు, ప్రతికూల రికమండేషన్లు వచ్చాయి.

టెస్టోస్టిరాన్, ఎమోషన్ రికగ్నిషన్

సైంటిఫిక్ రిసెర్చ్ పబ్లిషింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అధిక టెస్టోస్టిరాన్ ఉన్న పురుషులు దుఃఖం, అసహ్యం వంటి భావోద్వేగాలను గుర్తించడంలో విఫలమవుతుంటారు. ఇది డామినెన్స్ హైరార్కీని కాపాడుకోవడానికి సహాయపడుతుందని, కానీ భావోద్వేగ కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తుందని పరిశోధకులు వివరించారు.

వెరీవెల్ మైండ్ పరిశోధనల ప్రకారం టాక్సిక్ మాస్క్యులినిటీ అంటే మగాడు ఇలానే ఉండాలనే భ్రమ వల్ల ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్య రిస్క్ పెరుగుట, ఒంటరితనం, రిస్కీ బిహేవియర్, మాదకద్రవ్య వ్యసనం వంటి సమస్యలు పెరుగుతున్నట్లు తేలింది. అంతేకాకుండా 2018 నాటికి మహిళలకంటే పురుషులలో ఓపిఅయిడ్ ఓవర్‌డోస్ వల్ల మరణాలు అధికంగా ఉన్నట్లు తేలింది.

భారతీయ తల్లుల్లో కూడా ఈ లింగ పక్షపాతం కనిపిస్తుంది. అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యత్యాసం చూపించడం అక్కడి నుంచే మొదలవుతుందని అంటున్నారు. అమ్మాయికి చిన్నతనం నుంచి ఇంటి పని నేర్పినట్టుగా అబ్బాయిలకు నేర్పడం లేదు. ఇద్దరూ సమానమని ప్రసంగాలు ఇస్తున్న వాళ్లు కూడా ఇంట్లో అబ్బాయిలతో గిన్నె తోమడం, వంట చేయడం వంటివి నేర్పించడానికి వెనుకాడుతున్నారని తేలింది. తరాలుగా వస్తున్న ఈ వివక్షను మార్చడం అతి కష్టమని అంటున్నారు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ రిసెర్చ్ అండ్ అకాడమిక్ రివ్యూలో ప్రచురితమైన 760 మందితో చేసిన అధ్యయనంలో స్త్రీలు పాజిటివ్, నెగటివ్ రెండు విధాల భావోద్వేగ వ్యక్తీకరణలలోనూ అధికంగా ఉన్నట్లు తేలింది. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఇంపల్స్ స్ట్రెంత్ కూడా అధికంగా ఉంటుంది.

మై ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సంస్థ వివరిస్తూ, "బాయిస్ డోంట్ క్రై" అనే వాక్యం పూర్తిగా రబ్బిష్ అని, అబ్బాయిలు ఏడవడం వారి వెల్‌బీయింగ్‌కు కీలకమని చెప్పారు. 45 సంవత్సరాలలోపు పురుషులలో ఆత్మహత్య మరణాలకు ప్రధాన కారణం ఈ పోకడే కారణమని గణాంకాలు చెబుతున్నాయి.

పురుషులు నలుగురిలో కాకపోయినా ఒంటిరిగానైనా ఏడవడం మంచిదని అంటున్నారు. అలా ఏడవలేకపోవడం హానికరమే. మంచిదా చెడ్డదా? మానసిక ఆరోగ్య నిపుణులు ఏడవకపోవడం చెడ్డదని చెబుతున్నారు. హార్వర్డ్ హెల్త్ స్టడీ ప్రకారం, ఏడవడం ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్‌ను రిలీజ్ చేసి, ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది సామాజిక కండిషనింగ్ వల్ల వచ్చిన సమస్య. భావోద్వేగ వ్యక్తీకరణ ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది ,స్ట్రెస్ తగ్గుతుంది. సమాజం కూడా ఈ హానికరమైన మాస్క్యులిన్ నార్మ్స్‌ను మార్చుకోవాలి. పురుషుల భావోద్వేగ వ్యక్తీకరణను ప్రోత్సహించడంలో కుటుంబాలు, విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలి.