అలసట నుంచి ఉపశమనం పొందడానికి, రిఫ్రెష్ అవ్వడానికి చాలామంది థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. బీచ్లతో నిండిన థాయిలాండ్ను సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది వెళ్తూ ఉంటారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు అక్కడ బీచ్ ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని సముద్రపు అలలను ఆస్వాదించవచ్చు. ఈసారి మీ సెలవుల్లో థాయిలాండ్‌కు వెళ్లాలి అనుకుంటున్నట్లయితే.. తక్కువ ధరకే వెళ్లొచ్చు. ఎందుకంటే IRCTC థాయిలాండ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈ చవకైన ప్యాకేజీలో మీరు బ్యాంకాక్, పటాయాకు వెళ్లవచ్చు. మరి IRCTC ఇస్తోన్న ఈ అద్భుతమైన ప్యాకేజీ ఏంటో.. దాని పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC థాయిలాండ్ ప్యాకేజ్

IRCTC తరచుగా థాయిలాండ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేస్తుంది. అది థ్రిల్లింగ్ ఐలాండ్ అయినా, థాయిలాండ్ కాలింగ్ అయినా లేదా మరేదైనా. 4 రోజుల, 3 రాత్రుల ప్యాకేజీలో మీరు బస చేయడం నుంచి ఫుడ్, డ్రింక్, ట్రావెల్, విమానం వరకు అన్ని ఖర్చులు ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఈ ఆల్ ఇన్ వన్ ప్యాక్ చాలా చవకైనది. ఎందుకంటే ఇది కేవలం 49,500 రూపాయలకు థాయిలాండ్ వెళ్ళేలా చేస్తుంది.

ప్రాసెస్ ఇదే..

IRCTC అందిస్తోన్న ఈ ప్యాకేజీలో మీరు వేర్వేరు ప్రదేశాల నుంచి విమానాలు బుక్ చేస్తారు. అక్టోబర్ నెలలో అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక థాయిలాండ్ టూర్ ప్యాకేజీలో భాగంగా చెన్నై నుంచి విమానంలో బ్యాంకాక్‌కు వెళ్తారు. దీనిలు మీ రిటర్న్ ఫ్లైట్ కూడా కలిపే ఉంటుంది.

టూర్ ప్యాక్ వివరాలు

సందర్శించే ప్రదేశాలు - బ్యాంకాక్, పటాయా

ప్రయాణ మార్గం : విమానం

విమానం ఎక్కే ప్రదేశం : చెన్నై

ప్రయాణ తేదీ : 1-10-2025

తిరిగి వచ్చే తేదీ : 4.10.2025

టూర్ ప్యాకేజీ సౌకర్యాలు : సమాచారం కోసం, ఆహారం, పానీయాల నుంచి బస చేసే సౌకర్యం వరకు అన్నీ ఇందులో ఉన్నాయి.

టూర్ ప్యాకేజీ ధర : దీని ధర 49,500. ఇందులో ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఈ ధర 56,500కి పెరుగుతుంది. అయితే గ్రూప్ ప్యాకేజీ తీసుకుంటే ధర తగ్గుతుంది.

బుకింగ్ ఎలా చేయాలంటే..

థాయిలాండ్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి.. మీరు irctc.tourism.com అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఈ ప్యాకేజీని ఆన్లైన్లో బుక్ చేసుకుని లేదా ఆఫ్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ప్యాకేజీ గురించి మరింత సమాచారం కోసం.. మీరు 9003140682 లేదా 8287931974 ఎంక్వైరీ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు.

Also Read : ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నారా? మొదటిసారి వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే