<p><strong>IPS officer Sanjay: </strong>ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న టైంలో అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు, పని పూర్తి కాక ముందే 59 లక్షల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది. </p>