Ipl Vs Ranji: షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!

10 months ago 8
ARTICLE AD

Gujarat Titans: ఒకవైపు బీసీసీఐ దేశవాళీల్లో రంజీ ట్రోఫీ ఆడాలని చెబుతుంటే, కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కే మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్ కోసం రంజీ సన్నాహక శిభిరాలను కూడా స్కిప్ చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఢిల్లీ రంజీ జట్టులో చోటు చేసుకుంది. ఇటీవల ఐపీఎల్ మెగావేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు  అనూజ్ రావత్ ను కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటరైన అనూజ్ ను తమ భవిష్యత్తు సన్నాహకాల్లో భాగంగా కొనుగోలు చేసిననట్లు తెలుస్తోంది. అయితే ఒకవైపు రంజీ ట్రోఫీ మ్యాచ్ లుజరుగుతుండగానే, టైటాన్స్ జట్టు యాజమాన్యం ప్రీ ఐపీఎల్ సన్నాహక శిబిరాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఇందులో అనూజ్ పాల్గొనడం వివాదస్పదమైంది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అనూజ్ ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ముందస్తు అనుమతి తప్పనిసరి..
ఐపీఎల్లో పాల్గొనాలంటే ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేన్ల నుంచి ప్లేయర్లు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇక రంజీలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రంజీలకే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనూజ్ మాత్రం నిబంధనలు తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. డీడీసీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే టైటాన్స్ శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అనూజ్ తోపాటు ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, కుమార్ కుశాగ్ర, మహిపాల్ లామ్రోర్, అర్షద్ ఖాన్ తమ శిబిరానికి చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో అనూజ్ వైపు అందరి నజర్ నెలకొంది.

మరోవైపు శిబిరానికి వెళ్లేందుకు తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ పేర్కొన్నారు. ముందుస్తు అనుమతి లేకుండా తను ఇలా ప్రవర్తించడం సరికాదని ఫైరయ్యారు. రెడ్ బాల్ కంటే ధనాధన్ ఆటపైనే మక్కువ చూపెట్టడాన్ని ఆయన ఖండించారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇషాంత్ కేసు వేరు..
నిజానికి ఢిల్లీకే చెందిన ఇషాంత్ శర్మ ఈ శిబిరానికి హాజరైనప్పటికీ తన కేసు వేరని తెలుస్తోంది. రంజీలకు రిటైర్ అయిన ఆటగాళ్లు ఐపీఎల్ శిబిరాలలో పాల్గొనవచ్చు. దీంతో ఇషాంత్ శర్మతో సహా మిగతా రిటైర్డ్ క్రికెటర్లు ఐపీఎల్ ప్రీ క్యాంపుల్లో పాల్గొనడానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే మరో రెండు రంజీ మ్యాచ్ లు మిగిలి ఉన్న క్రమంలో చెప్పా పెట్టకుండా అనూజ్ ఇలా రంజీ ట్రైనింగ్ క్యాంపును వీడటంపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇలాంటి ఆటగాళ్లను ఉపేక్షించ కూడదని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా డొమెస్టిక్ క్రికెట్ పై పట్టుదలగా ఉండటంతో అనూజ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఈనెల 23 నుంచి మలి అంచె రంజీ పోటీలు జరుగుతాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ముగుస్తుంది. ఇక ఐపీఎల్ వచ్చే మార్చి 23 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Bumrah Award: బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్

Read Entire Article