INS Mahendragiri: మధ్యప్రాచ్యంలోని హోర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం (జూలై 11, 2026) ఒక కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో భారత నౌకాదళంలోకి సరికొత్త యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రవేశించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌ ఇప్పటివరకు సముద్రం ద్వారా తన మార్గాన్ని నిర్దేశించుకుందని, కానీ ఇకపై సముద్రమే దాని గమనాన్ని నిర్దేశిస్తుందని అన్నారు.

INS Mahendragiri (F38), the sixth and final Nilgiri-class (Project 17A) indigenous stealth frigate, was commissioned into the Indian Navy's Eastern Fleet. pic.twitter.com/ndGULAeSXP

— Defence Squad (@Defence_Squad_) July 11, 2026

రాజ్‌నాథ్ సింగ్ ప్రకారం, భారత నౌకాదళం స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ 'మహేంద్రగిరి' ఒక 'బ్లూ-వాటర్ షిప్'. అంటే, ఇది భారతదేశ సముద్ర ప్రయోజనాలను తీరానికి సమీపంలోనే కాకుండా, సుదూర లోతైన సముద్రాలలో కూడా వారాల తరబడి కాపాడగలదు. ఇప్పుడు భారత్‌ సముద్రాల్లో ప్రయాణించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది."

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ప్రాణాంతకమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను కలిగి ఉన్న మహేంద్రగిరి, నౌకాదళ ప్రాజెక్ట్ 17Aలో ఆరవ, చివరి యుద్ధనౌక. ఈ ప్రాజెక్ట్ కింద, ముంబైలోని మజగావ్ డాక్‌యార్డ్స్ లిమిటెడ్ (MDL)లో నాలుగు, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ (GRSE)లో రెండు స్టెల్త్ ఫ్రిగేట్‌లను నిర్మించారు.

MDL వద్ద
1. INS నీలగిరి
2. INS విద్యాగిరి
3. INS తారాగిరి
4. INS మహేంద్రగిరి

GRSE వద్ద
1. INS దొనగిరి
2. INS వింధ్యగిరి వద్ద నిర్మించారు.

భారత నౌకాదళం చేరిన యుద్ధనౌకలు

గతేడాదిన్నర కాలంలో ఈ ఆరు యుద్ధనౌకలను భారత నౌకాదళంలోకి చేరాయి. బ్రహ్మోస్‌తోపాటు, మహేంద్రగిరిలో సుదూర ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి, దూరం నుంచి వచ్చే ఏ ముప్పునైనా గుర్తించి, నాశనం చేయగల బహుళ ప్రయోజన రాడార్ కూడా ఉన్నాయి. శత్రు జలాంతర్గాములను నాశనం చేయడానికి ఇందులో స్వదేశీ రాకెట్ లాంచర్లు, టార్పెడో లాంచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఇంటిగ్రేటెడ్ సబ్‌మెరైన్ నిరోధక రక్షణ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలు, సైనిక పరికరాలు ఐఎన్ఎస్ మహేంద్రగిరిని, మహేంద్రగిరి పర్వతం మాదిరిగానే శక్తివంతం చేయనున్నాయి.

ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం పేరు మీదుగా ఈ యుద్ధనౌకకు నామకరణం చేశారు. పురాణాల ప్రకారం, మహేంద్రగిరి పర్వతం పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశంగా చెబుతారు.

మహేంద్రగిరి యుద్ధనౌక గురించిన మరిన్ని అంశాలు...

నౌకాదళం ప్రకారం, మహేంద్రగిరి యుద్ధనౌక చిహ్నంపై ఉండే గరుడ పక్షి నిర్భయత్వం, శౌర్యం, అజేయతకు ప్రతీక. మహేంద్రగిరి ధైర్యానికి పరాకాష్టగా నిలుస్తుంది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌక రూపకల్పన బ్యూరో రూపొందించిన ఈ ఆరు స్టెల్త్ ఫ్రిగేట్లు, స్వావలంబన, స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం దిశగా సాగుతున్న ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తున్నాయి. ఈ నౌకలు సముద్ర భద్రతా కార్యకలాపాలు, రీసెర్చ్, రక్షణ మిషన్లు, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలలో (HADR) సమర్థవంతంగా పనిచేస్తాయి.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు ?

విశాఖపట్నంలో నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ యుద్ధ స్వరూపాన్ని మార్చినప్పటికీ, అవి సంప్రదాయ యుద్ధ ప్రాముఖ్యతను ఏమాత్రం తగ్గించలేదని అన్నారు. ఇక్కడ అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను ప్రస్తావించకుండానే యుద్ధం తీరును గుర్తు చేశారు. యుద్ధం ప్రాథమిక సూత్రాలను నెరవేర్చడానికి బలమైన సంప్రదాయ సామర్థ్యాల అవసరం నేటికీ తీవ్రంగా ఉందని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకారం, భవిష్యత్ యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జరిగినా, ఒక దేశ సంకల్పం, శిక్షణ పొందిన సైనికులు, విశ్వసనీయమైన సైనిక శక్తి ద్వారానే విజయం సాధిస్తుందని చెప్పకనే చెప్పారు.