Indian family in Texas welcomes cow What next: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబం తమ కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆవును గృహప్రవేశ వేడుకకు తీసుకువచ్చింది. అచ్చ తెలుగు సంప్రదాయంగా ఈ గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో ఆవును పవిత్రంగా భావించి, కొత్త ఇంట్లోకి ఆవును తీసుకురావడం శుభసూచకమని నమ్ముతారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సదరు కుటుంబం సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన రావడమే కాకుండా, పెద్ద ఎత్తున జాత్యహంకార వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

పాశ్చాత్య నెటిజన్లు వివక్షా పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు అమెరికా సంస్కృతిలో కలిసిపోయే ఉద్దేశం ఏమాత్రం లేని వారు అంటూ కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు భారతీయ సంప్రదాయాలను కించపరుస్తూ జాత్యహంకార పూరితమైన భాషను ఉపయోగిస్తున్నారు. వలస వచ్చిన వారు తమ మూలాలను వదులుకోకుండా ఉండటాన్ని అక్కడి కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ద్వేషపూరిత ప్రసంగానికి తెరలేపారు.

When the house is brand new but the mindset is prehistoric.

Welcome to Texas:

Buy a brand-new million dollar house in a Dallas suburb, then let cows wander across the marble floors like it’s a barn.

Zero intention of integrating. pic.twitter.com/eovjkV6nFT

— The Repatriator (@DrRepatriator) January 31, 2026

ఈ విమర్శలపై భారతీయ సమాజం, సంస్కృతిని గౌరవించే వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. అమెరికా అనేది వివిధ సంస్కృతుల కలయిక అని, ఎవరి మత విశ్వాసాలను వారు అనుసరించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని వారు వాదిస్తున్నారు. ఒక పెంపుడు జంతువును ఇంట్లోకి తీసుకురావడం కంటే ఆవును తీసుకురావడం ఏ విధంగా భిన్నమని ప్రశ్నిస్తూ, విమర్శకులకు సమాధానమిస్తున్నారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించాల్సింది పోయి, ఇలాంటి చిన్న విషయాలను జాత్యహంకారంతో చూడటం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Strange world we live in: A house-warming with alcohol is called 'modern,' but welcoming a sacred living being- the symbol of life and sustenance -is called 'prehistoric.'
To some, a house is just bricks and mortar. To us, it is a temple. We don't just move into a space; we…

— Krithika ✨ (@traversingkrith) February 2, 2026

ప్రస్తుతం ఈ ఘటన అమెరికాలో పెరుగుతున్న జెనోఫోబియా , వలసదారుల పట్ల ఉన్న అసహనాన్ని ప్రతిబింబిస్తోంది. గతంలో కూడా భారతీయుల ఆహారపు అలవాట్లు, పండుగలపై ఇలాంటి విమర్శలు వచ్చినప్పటికీ, ఈసారి గృహప్రవేశ వేడుకను లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది.