Indian Cricketers Salary for Mens and Women: క్రికెట్‌లో భారత పురుషులు, మహిళల జట్లు రెండూ తమ సత్తా చాటుతున్నాయి. భారత పురుషుల జట్టు T20 ప్రపంచ కప్ 2024, ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. అయితే భారత మహిళల జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు చేరుకుని తమ మొదటి టైటిల్‌ను గెలుచుకోవడానికి అడుగు దూరంలో ఉంది. భారత పురుషులు, మహిళా ఆటగాళ్లు ఇద్దరూ దేశానికి పేరు తెచ్చారు. ఇరు జట్ల ఆటగాళ్లకు ఎంత జీతం వస్తుందో మీకు తెలుసా? ఇక్కడ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును సమానంగా ఇస్తుందని మీకు తెలుసా..

పురుషులు, మహిళలకు సమాన జీతం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) పురుషులు, మహిళా ఆటగాళ్లకు సమాన మ్యాచ్ ఫీజును అందిస్తుంది. BCCI పురుషులు, మహిళా క్రికెటర్లకు ఒక టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, ఒక వన్డే మ్యాచ్‌కు 6 లక్షలు, ఒక T20 ఇంటర్నేషనల్‌కు 3 లక్షలుగా సమాన జీతం ఇస్తుంది.

పురుషులు, మహిళల టాప్ గ్రేడ్‌లో రూ.6.50 కోట్ల వ్యత్యాసం

మహిళా క్రికెటర్లను 'గ్రేడ్ A'లో ఉన్న క్రీడాకారులకు BCCI ఏడాదికి 50 లక్షల రూపాయలు ఇస్తుంది. అయితే పురుష క్రికెటర్ల గ్రేడ్ A+లో చేర్చిన క్రీడాకారులకు సంవత్సరానికి రూ. 7 కోట్లు లభిస్తాయి.

పురుషులు, మహిళల రెండవ గ్రేడ్‌లో 16 రెట్లు వ్యత్యాసం

మహిళా క్రికెటర్ల గ్రేడ్ B ఆటగాళ్ల వార్షిక జీతం రూ.30 లక్షలు. పురుష క్రికెటర్ల రెండవ గ్రేడ్ అంటే 'గ్రేడ్ A'లో ప్రతి ఆటగాడికి ఏడాదికి 5 కోట్లు చెల్లిస్తారు. అంటే ఇక్కడ ఏకంగా 16 రెట్లు ఎక్కువ వ్యత్యాసం ఉంది.

మూడవ గ్రేడ్‌లో 30 రెట్లు వ్యత్యాసం

మహిళా క్రికెటర్ల గ్రేడ్ Cలో ఉన్న క్రీడాకారులకు సంవత్సరానికి కేవలం రూ.10 లక్షలు జీతం లభిస్తుంది. పురుషుల మూడవ గ్రేడ్ అంటే గ్రేడ్ Bలో 3 కోట్లు లభిస్తాయి. అంటే ఇద్దరి జీతాల్లో 30 రెట్లు వ్యత్యాసం ఉంది. పురుష క్రికెటర్లలో నాల్గవ గ్రేడ్ కూడా ఉంది. గ్రేడ్ Cలో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి రూ.1 కోటి జీతం లభిస్తుంది. అయితే మహిళల క్రికెట్‌లో నాల్గవ గ్రేడ్ లేదని తెలిసిందే