Hurun India Wealth Report 2025: భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. కొత్త పరిశ్రమలు, చాలా పెద్ద కంపెనీలు భారతదేశానికి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోటీశ్వరులు, బిలియనీర్ల సంఖ్య కూడా అదే రీతిగా పెరుగుతోంది. సంపదలో భారతదేశంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఒక కొత్త కోటీశ్వరుల కుటుంబం తయారవుతోంది. బిలియనీర్ల విషయానికి వస్తే, కొత్త నివేదిక ప్రకారం ప్రతి 5 రోజులకు భారతదేశంలో ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొస్తున్నాడు. ప్రతి 5 రోజులకు ఒక బిలియనీర్ పుడుతున్నప్పుడు, ఈ విషయంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త నివేదికలో ఆసక్తికర విషయాలు
మెర్సిడేస్ బెంజ్ Hurun India Wealth Report 2025 ప్రకారం, భారతదేశంలో కోటీశ్వరులు వేగంగా పెరుగుతున్నారు. 2021లో దేశంలో 4.58 లక్షల కోటీశ్వరుల కుటుంబాలు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 8.71 లక్షలకు చేరింది. అంటే కేవలం 4 సంవత్సరాలలో దాదాపు 90 శాతం వృద్ధి నమోదైంది. ఈ నివేదికలో మొత్తం ఆస్తి రూ.8.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాన్ని కోటీశ్వరులుగా పేర్కొన్నారు.

భారతదేశంలో ప్రతి 5 రోజులకు ఒక కొత్త బిలియనీర్
Hurun Global Rich List ప్రకారం, ఇప్పుడు ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకుంది. చైనా, అమెరికా తర్వాత, భారతదేశం అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా నిలిచింది. భారతదేశంలో ప్రతి 5 రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొస్తున్నాడు. ఇది ఆర్థిక వృద్ధి, స్టార్టప్‌ల విజయం, స్టాక్ మార్కెట్ వృద్ధితో పాటు సాంకేతిక రంగం (IT Sector) అద్భుత ఫలితాల ప్రభావం అని అభిప్రాయపడింది.

ఈ Hurun India Wealth Report ప్రకారం, భారతదేశపు కోటీశ్వరుల రాజధానిగా ముంబై నిలిచింది. ఇక్కడ 1.42 లక్షల కోటీశ్వరుల ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం రాష్ట్రాల విషయానికి వస్తే, మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. దీని తరువాత తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక నగరాలు ఉన్నాయి. కోటీశ్వరుల సంఖ్య పెరగడానికి కారణం కొత్త టెక్నాలజీ, స్టార్టప్‌లు, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందడం కారణమని చెప్పవచ్చు.