Asia Cup India vs Pakistan | ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. కానీ సోషల్ మీడియాలో నుంచి రోడ్ల వరకు ఈ మ్యాచ్ గురించి గతంలో ఉండే క్రికెట్ ఫీవర్, వాతావరణం కనిపించడం లేదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి మునుపటి హైప్ లేదు. కశ్మీర్ లో ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు జట్లు మొదటిసారిగా ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురించి అభిమానులు 2 గ్రూపులుగా విడిపోయారు. కొంతమంది ఈ ముఖాముఖి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరికొందరు ఈ మ్యాచ్‌ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్, దుబాయ్ పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మీకు తెలియజేస్తున్నాము.

ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే ఛాన్స్

భారత్, పాకిస్తాన్ రెండూ ఆసియా కప్‌ 2025ను విజయంతో ప్రారంభించాయి. పాకిస్తాన్ ఒమన్‌ను ఓడించగా, భారత్ యూఏఈని ఓడించింది. ఇప్పుడు ఇరు జట్లు ఆదివారం దుబాయ్ మైదానంలో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు కనిపించవచ్చు. అయితే, పాకిస్తాన్ స్పిన్ కోసం ఐదుగురు (ఇద్దరు ఆల్ రౌండర్లు) ఆప్షన్లను కలిగి ఉంది.

దుబాయ్ పిచ్ రిపోర్ట్

ఆసియా కప్‌లో ఇప్పటివరకు దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లను చూస్తే, పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 180 కంటే ఎక్కువ పరుగులు సులభంగా డిఫెండ్ చేయవచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇక్కడ విజయం అంత ఈజీ కాదు. బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టం అవుతుంది. మంచు ప్రభావం పెద్దగా ఉండదు. అటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి.

మ్యాచ్ ప్రిడిక్షన్

ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధిస్తుందని మ్యాచ్ ప్రిడిక్షన్ మీటర్ చెబుతోంది. అయితే మ్యాచ్ దుబాయ్‌లో ఉంది కాబట్టి, పాకిస్తాన్ తో హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది, కానీ విజయం సాధించే అవకాశాలు భారత్‌కే ఎక్కువ. ఇండియా మొదట బ్యాటింగ్ చేసినా లేదా తర్వాత బ్యాటింగ్ చేసినా, భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువ అని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

పాకిస్తాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్- సల్మాన్ అలీ ఆగా, సామ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, మొహమ్మద్ నవాజ్, సుఫియాన్ ముకీమ్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్.