ఆసియా క్రీడల్లో భారత్ ఒకేరోజు 4 స్వర్ణాలు సాధించింది. భారత రెజ్లర్ సుజీత్ ఆసియా క్రీడల్లో అద్భుతం చేశారు. ఒలింపిక్ ఛాంపియన్ ను ఓడించి, ఆ తరువాత ఫైనల్ పోరులోనూ నెగ్గి బంగారు పతకం అందుకున్నాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో స్వర్ణ పతకం సుజీత్ సాధించాడు. ఫైనల్ పోరులో సుజీత్ తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్మాజిద్ కుదీవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభంలో వెనుకంజలో ఉన్నప్పటికీ అద్భుతంగా పుంజుకుని 10-9 తేడాతో ఉత్కంఠ పోరులో విజయాన్ని నమోదు చేశాడు.

గోల్డ్ మెడల్ మ్యాచ్ కంటే ముందు భారత రెజ్లర్ సుజీత్ కలకల్ ఒలింపిక్ ఛాంపియన్‌ను మట్టికరిపించాడు. సుజీత్ ఒలింపిక్ ఛాంపియన్ కొటారో కియోకాను 3- 3 తేడాతో (స్కోరు సమం కావడంతో, టెక్నికల్ రూల్స్ ఆధారంగా) ఓడించి పురుషుల 65kg కేటగిరీ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శిస్తూ చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Indian wrestler Sujeet Kalkal has won the gold medal in the men's 65kg freestyle wrestling category at the 2026 Asian Games pic.twitter.com/33jt7NMGTD

— ANI (@ANI) October 2, 2026

గోల్డ్ మెడల్ మ్యాచ్‌ కంటే ముందే సుజీత్ అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేశాడు. ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించినప్పుడే ఆయన ఛాంపియన్ అవుతాడని అంతా భావించారు. అయితే, సుజీత్‌కు గోల్డ్ మెడల్ మ్యాచ్ అంత ఈజీగా రాలేదు. తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్మాజిద్ కుదీవ్‌తో జరిగిన గోల్డ్ మెడల్ పోరులో సుజీత్ మొదట వెనుకంజలో ఉన్నాడు. చివరికి పుంజుకుని సుజీత్ 10-9 తేడాతో విజయాన్ని సాధించి భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చాడు. సుజీత్ ఒక దశలో 2-9 తేడాతో వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఊహించని రీతిలో పుంజుకుని వరుసగా 8 పాయింట్లు సాధించి విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.

చిత్తుగా ఓడించి గోల్డ్ మెడల్

భారత బాక్సర్ అంకుష్ పంగాల్ 80 కిలోల విభాగం ఫైనల్లో నెగ్గి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. గోల్డ్ మెడల్ కోసం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ మిన్‌సాంగ్‌ను 4-0 తేడాతో చిత్తు చేశాడు. ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం. ఆ తరువాత ఒక్క నిమిషంలోనే సుజీత్ 15వ స్వర్ణాన్ని కూడా అందించాడు. 26 ఏళ్ల బాక్సర్ అంకుష్ పంగాల్ ఫైనల్లో కొరియా బాక్సర్‌ను ఓడించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ప్రారంభంలో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఫజ్లిద్దీన్ ఎర్కిన్‌బోయెవ్‌ను 4-1 తేడాతో ఏకపక్ష పోరులో ఓడించాడు. 75 కేజీల విభాగంలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ కావడం విశేషం.

చరిత్ర సృష్టించిన అంకుష్
2018 ఆసియా గేమ్స్ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత పురుష బాక్సర్‌గా అంకుష్ పంగాల్ నిలిచాడు. ఆయన కంటే ముందు బాక్సింగ్‌లో చివరి స్వర్ణ పతకాన్ని అమిత్ పంగాల్ 2018లో గెలిచాడు. అంకుష్ పంగాల్ హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన బాక్సర్. అతడి తండ్రి కబడ్డీ ప్లేయర్.. దాంతో క్రీడలపై అతడికి ఆసక్తి ఏర్పడింది. అంకుష్ కబడ్డీలో జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ తన తండ్రి సూచనతో బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టాడు. శిక్షణ కోసం తన గ్రామం నుండి 15 కిలోమీటర్లు వెళ్లేవాడు. తండ్రి స్వయంగా తీసుకెళ్లి ప్రాక్టీసు తరువాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చేవారు.

2018లో హర్యానా స్టేట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత బాక్సింగ్ కూడా వదిలేయాలనుకున్నాడు. కానీ తన తండ్రి అలా చేయకుండా నచ్చజెప్పి ప్రోత్సహించారని తెలిపాడు. నేడు అంకుష్ ఆసియా క్రీడల్లో సాధించిన ఈ గోల్డ్ మెడల్ వెనుక అంకుష్ తండ్రి కష్టం, త్యాగాలు కూడా ఉన్నాయి.

భారత బంగారాలు మహిళా బాక్సర్లు లవ్లీనా, పర్వీన్‌ హుడా

భారత బాక్సర్లు లవ్లీనా, పర్వీన్‌ హుడా స్వర్ణాలు సాధించారు. తొలుత లవ్లీనా 75 కేజీల విభాగంలో చైనాకు చెందిన బావో జియిపై గెలుపొందింది. ఆసియా గేమ్స్ లో బాక్సింగ్‌‌లో గోల్డ్ సాధించిన సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. తర్వాత 65 కేజీల విభాగంలో పర్వీన్‌ అద్భుతం చేసింది. చైనీస్ తైపీ బాక్సర్ నీన్‌ చిన్‌ చెన్‌పై 3-2 తేడాతో నెగ్గి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.