India- Bangladesh: సరిహద్దు కంచెపై రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సోమవారం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరుల్ ఇస్లాంను పిలిపించింది. ఈ అంశంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపిన తర్వాత నూరుల్ ఇస్లాం సౌత్ బ్లాక్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించాడు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి 5 చోట్ల కంచె నిర్మించడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించిన తర్వాత సరిహద్దు వెంబడి భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ప్రకారం.. (వాయువ్య) చాపైనావాబ్‌గంజ్, నవోగావ్, లాల్మోనిర్హాట్, తీన్ బిఘా కారిడార్‌తో సహా ఐదు ప్రాంతాలలో ఘర్షణలు చెలరేగాయి.

Also Read : Maha Kumbh 2025: అడ్డమైన ప్రశ్న అడిగాడని యూట్యూబర్‌ను చితబాదిన బాబా - మహాకుంభమేళాలో వైరల్ వీడియో

భారత హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ సమన్లు
సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతపై చర్చించడానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించింది. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జాషిం ఉద్దీన్ ఢాకాలో ప్రణయ్ వర్మను కలిసి, ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తరపున "తీవ్ర ఆందోళన" వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. 'భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ఇటీవల కార్యకలాపాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి రాయబారి మొహమ్మద్ జాషిం ఉద్దీన్ ఆదివారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మతో విదేశాంగ వ్యవహారాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో

45 నిమిషాల పాటు సమావేశం
ప్రణయ్ వర్మ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. విదేశాంగ కార్యదర్శితో ఆయన సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత.. ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, 'కచ్చిత సరిహద్దులను నిర్ధారించడం, అక్రమ రవాణా, నేరస్థుల కదలిక , మానవ అక్రమ రవాణా సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో భారతదేశం నిబద్ధత గురించి చర్చించడానికి నేను విదేశాంగ కార్యదర్శిని కలిశాను' అని అన్నారు.

Also Read : Pakistan : కొత్త బంగారు గని పాక్ కష్టాలను గట్టెక్కిస్తుందా? - లేక ఆఫ్రికా పరిస్థితే దీనికి కూడా వస్తుందా!