Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
2 months ago 4
ARTICLE AD
Independence Day Questions and Answers : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజు భారతదేశ స్వాతంత్య్రానికి మాత్రమే కాకుండా.. UPSC , SSC, రైల్వే, బ్యాంకింగ్, NDA వంటి పరీక్షలలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అందుకే విద్యార్థులు ఆగస్టు 15వ తేదీ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం, జాతీయ జెండా, స్వాతంత్య్రానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకోవడం మంచిది. మరి పోటీ పరీక్షల్లో స్వాత్యంత్య్రానికి సంబంధించి ఎక్కువగా వచ్చిన ప్రశ్నలు ఏంటో.. వాటి సమాధానాలు ఏంటో చూసేద్దాం.
పోటీ పరీక్షలలోని జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఆగస్టు 15వ తేదీకి సంబంధించిన ప్రశ్నలు తరచుగా అడుగుతారు. అందువల్ల గత ప్రశ్నలతో పాటు రాబోయే ప్రశ్నలకు కూడా సిద్ధమవడం పరీక్షకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షల్లో ఆగస్టు 15వ తేదీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకుందాం.
ప్రశ్న :  భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
జవాబు : 1885.
ప్రశ్న :  "భారతదేశపు మహానుభావుడు" అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : దాదాభాయ్ నౌరోజీ
ప్రశ్న :  బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు?
జవాబు : దాదాభాయ్ నౌరోజీ
ప్రశ్న :  "ఢిల్లీ చలో" అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
జవాబు : సుభాష్ చంద్ర బోస్
ప్రశ్న :  స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
జవాబు : సుకుమార్ సేన్
ప్రశ్న :  భారతదేశ స్వాతంత్ర్యం ఆధారంగా "ఇండియా విన్స్ ఫ్రీడమ్" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
జవాబు : మౌలానా అబుల్ కలాం ఆజాద్
ప్రశ్న :  భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది?
జవాబు : నవంబర్ 26, 1949
ప్రశ్న : 2026లో భారతదేశం ఏ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది?
జవాబు : 80వ స్వాతంత్ర్య దినోత్సవం
ప్రశ్న : జై హింద్ అంటే ఏమిటి?
జవాబు : భారతదేశం గెలవాలి.
ప్రశ్న : ఏ చట్టం ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది?
జవాబు : భారత స్వాతంత్ర్య చట్టం 1947
ప్రశ్న : భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు?
జవాబు : పింగళి వెంకయ్య
ప్రశ్న : "క్విట్ ఇండియా ఉద్యమం"ను మరో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు : ఆగష్టు విప్లవం (ఆగష్టు విప్లవం అని కూడా పిలువబడే క్విట్ ఇండియా ఉద్యమం 1942లో ప్రారంభమైంది. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభించారు.)
ప్రశ్న :  "భారత విప్లవ మాత"గా ఎవరు ప్రసిద్ధి చెందారు?
ప్రశ్న : భారత జాతీయ జెండా మధ్యలో ఉండే చిహ్నం ఏమిటి?
జవాబు : అశోక చక్రం (భారత త్రివర్ణ పతాకంలోని తెల్లని చార మధ్యలో నీలి రంగు అశోక చక్రం ఉంటుంది. దీనికి 24 ఆకులు ఉంటాయి.)
ప్రశ్న : క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారత గడ్డపై జాతీయ జెండాను ఎగురవేసిన తొలి మహిళ ఎవరు?
జవాబు : అరుణా అసఫ్ అలీ (1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభంలో అరుణా అసఫ్ అలీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆమె భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోని అత్యంత ప్రముఖ మహిళా నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు.)
Also Read : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Read Entire Article