IND vs NZ T20 World Cup: గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ సాంసన్ జర్నీ!

1 month ago 6
ARTICLE AD

IND VS NZ T20 World Cup Final:  గ్రహాలపై కాదు నీపై నువ్వు నమ్మకం పెట్టుకో.. ఏదో ఓ రోజు ఆ గ్రహాలే నిన్ను వెతుక్కుంటూ వచ్చి అనుగ్రహం చూపిస్తాయ్

కష్టకాలాన్ని తలుచుకుని నిరాశలో కూరుకుపోవద్దు..అదే కష్టంతో అడుగువెయ్ ఏ అడ్డంకులు నిన్ను ఆపుతాయో చూద్దాం

గ్రహాలను, అదృష్టాన్ని కాదు..ముందు నిన్ను నువ్వు నమ్ముకో అని తండ్రి చెప్పిన మాటలే సంజూ సాంసన్ ని ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది  టోర్నమెంట్ గా నిలబెట్టాయ్.

లేదంటే.. అసలు టీమ్ లో ప్లేస్ లేనోడు నాకౌట్ 3 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో ఇరగదీయం ఏంటి?..

టైమ్ బాలేదు అనుకోవడం కాదు..ఎందుకు బావోదో చూద్దాం అంటూ కాలానికి తన కష్టంతో ఎదురీది సమాధానం చెప్పాడు

కేరళలో ఓ చిన్న పట్టణంలో సముద్రం ఒడ్డున పెరిగిన సంజూ సాంసన్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ బ్యాట్ తోనే స్నేహం. తండ్రి ఓ పోలీస్ అధికారి...నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేది కొడుకుని నెట్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లేవాడు. నమ్మకం ఉంటే గ్రహాలు కలిసొస్తాయ్ అని చెబుతూ ఉండేవాడు. అప్పట్లో సంజూకి ఆ మాటలు అర్థంకాలేదు కానీ.. జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు అర్థమయ్యాయ్. సంజూ టాలెంట్ ఎలాంటిదంటే IPL రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కొట్టిఅందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, రెండింట్లోనూ మాస్టర్ సంజూ...కానీ భారత జట్టులో చోటు దక్కలేదు. రిషభ్ పంత్, ఇషాన్ లాంటి స్టార్ల మధ్య సంజూ ఎప్పుడూ బెంచ్ పైనే కూర్చునేవాడు.నువ్వు టీమ్ లో లేవు అని సెలెక్టర్లు చెప్పినప్పుడల్లా హృదయం ముక్కలయ్యేది కానీ మౌనంగా ప్రాక్టీస్ కి వెళ్లిపోయేవాడు.

ఎన్నో నిద్రలేని రాత్రులు

ఒంటరిగా నెట్స్ లో బాల్స్ ఎదుర్కొన్న రోజులు

నీ కష్టం వృధాకాదు సంజూ కాలం సమాధానం చెబుతుందనే భార్య ప్రోత్సాహం

2024 T20 వరల్డ్ కప్ లో సంజూ జట్టులో ఉన్నాడు కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇండియా విన్ అంటూ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే సంజూ డ్రెస్సింగ్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు..ఈ విజయంతో తాను భాగమైతే బావుండును కదా అని. కానీ మరుక్షణమే తనకి తాను సమాధానం చెప్పుకున్నాడు, తండ్రి మాటలు గుర్తు చేసుకున్నాడు. మరింత కష్టపడ్డాడు..డొమెస్టిక్ మ్యాచుల్లో సెంచరీలు చేశాడు. IPL లో కెప్టెన్ గా రాణించాడు కానీ సెలెక్టర్లు మళ్లీ పట్టించుకోలేదు

2026 వచ్చింది
T20 వరల్డ్ కప్.. సంజూ జట్టులోకి వచ్చాడు కానీ రిజర్వ్ ప్లేయర్ గానే. గ్రూప్ స్టేజ్ లో ఇషాన్ కిషన్ ఇంజురీ అయ్యాడు. అప్పుడు సంజూకి ఛాన్సొచ్చింది. మొదటి మ్యాచ్ లో 22 రన్స్ చేశాడు కానీ ఎవ్వరూ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. సూపర్ 8 నుంచి సెమీస్ లో  అడుగు పెట్టాలంటే వెస్టిండీస్ మీద 97 రన్స్ తో మ్యాజిక్ చేశాడు. సెమిస్ లో ఇంగ్లాండ్ మీద 89 రన్స్..సేమ్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై కూడా 89 పరుగులు చేశాడు. నాకౌట్ 3 మ్యాచుల్లో సంజూ సంజూ అంటూ స్టేడియం మారుమోగిపోయింది.కానీ సంజూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు...అది సంతోషం కాదు..ఎన్నో ఏళ్ల కష్టం బయటపడిన, గుర్తింపు దక్కిన క్షణాలవి.

సంజూ సాంసన్ ఆడినవి 5 మ్యాచ్ లే.. వాటిలో మూడు మ్యాచుల్లో ఇండియా ని గెలిపించాడు. ఆ మూడు మస్ట్ గా ఇండియా గెలవాల్సిన మ్యాచ్ లే కావడం ఇంట్రెస్టింగ్.

నాకౌట్ మూడు మ్యాచుల్లోనూ మూడు హాఫ్ సెంచరీలు..అవార్డ్ తీసుకుంటూ సంజూ మైక్ లో మాట్లాడిన మాటలు .. ఇది కలలా ఉంది, నా కష్టానికి సమాధానం , నా తండ్రి - నా భార్య- నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ ఇది అంకితం అని చెప్పాడు..ఆ క్షణం సంజూ కళ్లలో కన్నీళ్లు..

నమ్మకం ఉంటే విజయం వచ్చి తీరుతుంది అని చెబుతుంది సంజూ కథ..

కష్టపడితే దుష్ట గ్రహాలు కూడా అనుకూలం అవుతాయని చెబుతుంది సంజూ విజయం..

ఫైనల్లీ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది.. సంజూ సక్సెస్ లా...

Read Entire Article