ICC Champions Trophy 2025 | 19 నవంబర్ 2023 ఆ రోజు టీమిండియా జరిగిన పరాభవం. ఎప్పటికీ భారత క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేనిది. ఫైనల్ వరకూ ప్రతి ఒక్కరూ ఇరగదీశారు. మహ్మద్ షమీ వికెట్ల వేట... కెప్టెన్ రోహిత్ శర్మ సెల్ఫ్ లెస్ ఇన్నింగ్స్... ఛేజింగ్ మాస్టర్, రన్ మేషిన్ విరాట్ ఫామ్ లోకి వచ్చిన ఆనందం.. లక్షా 30వేల భారత అభిమానులు సాక్షిగా.. ఓ ఆసీస్ సైలెన్సర్ మనల్ని సైలెంట్ చేశాడు. అది చాలదన్నట్లు ఓ ‘హెడ్’ మాస్టర్ మన పెట్టిన లక్ష్యాన్ని హల్వా తిన్నట్లు ఊదేశాడు. రిజల్ట్ భారత్ వరల్డ్ కప్ కల చెదిరిపోయింది. 2011 తర్వాత మళ్లీ మనదే వరల్డ్ కప్ అని బలంగా నమ్మిన అభిమానులను ఆ రోజు ఆసీస్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ సైలెంట్ చేస్తే... రెండేళ్ల తర్వాత అంత కాకపోయినా అంతకంత పగ తీర్చుకోవటానికి మనోళ్లకు అవకాశం వచ్చింది.

మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో మార్చి 4న మళ్లీ ఇండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఓడిన వాడు ఇంటికి గెలిచిన వాడు ఫైనల్ కి పోతాడు. కనుక డూ ఆర్ డై లాంటి ఈ మ్యాచ్ లో భారత్ ఏం చేస్తుందనే టెన్షన్...రోహిత్ శర్మ సైన్యం కచ్చితంగా బదులు తీర్చుకోవాలనే కసి స్పష్టంగా కనిపిస్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఇదే విధంగా టీమిండియా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు వెళ్లిన అక్కడ లంకకు షాక్ ఇచ్చి వరల్డ్ కప్ ను ముద్దాడింది. అచ్చం అలానే ఈసారి కూడా ఛాన్స్ వచ్చింది. మళ్లీ సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడిస్తే...ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ల్లో ఓ టీమ్ ను ఢీకొట్టి మినీ వరల్డ్ కప్ ను కొట్టేసే ఛాన్స్ వచ్చింది. మరి దుబాయ్ మన దొరబాబులు ఏం చేస్తారో చూడాలి.

హెడ్ మాస్టర్ ని ఆపగలిగితేనే..
టీమిండియా ఐసీసీ టోర్నీల కలను చెదరగొడుతున్న ఓ కంగారూ బ్యాటర్ ఉన్నాడు. ఆయన పేరే ట్రావియెస్ హెడ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడేప్పుడు ముద్దుగా హెడ్ మాస్టర్ అని హైదరాబాదీలు పిలుచుకునే ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ గడచిన రెండేళ్ల కాలంలో మన చేతుల్లో నుంచి రెండు ఐసీసీ టోర్నీలు లాగేశాడు అంటే ఎగ్జాగరేషన్ కాదు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్. లండన్ లో మనోళ్లకు, ఆస్ట్రేలియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ట్రావియెస్ హెడ్ అడ్డం పడి మన విక్టరీని లాగేసుకున్నాడు. ఏకంగా 163 పరుగులు బాది టీమిండియా పై ఆస్ట్రేలియాకు 209 పరుగుల విక్టరీతో పాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కట్టబెట్టాడు.

మళ్లీ అదే హెడ్ 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మన కలల్ని ఆశల్ని చిదిమేశాడు. మనోళ్లే కుయ్యో మొర్రో అంటూ 240 పరుగులు చేస్తే ఈ హెడ్మాస్టర్ ఫైనల్లో మనోళ్లను ఎడాపెడా కుమ్మేశాడు. 137పరుగులు బాది గ్రౌండ్ లో ఉన్న లక్షా 20 వేల అభిమానులను సైలెంట్ చేయటంతో పాటు వన్డే వరల్డ్ కప్ నూ లాగేసుకున్నాడు మన చేతుల్లో నుంచి. ఇప్పుడు అలాంటోడు మళ్లీ వస్తే అన్నట్లుంది పరిస్థితి. ఐసీసీ టోర్నీ ఫైనల్లో రెండుసార్లు మనకి తలనొప్పిలా మారిన హెడ్డు ఈ సారి సెమీస్ లో నే తగులుతున్నాడు టీమిండియా ఫ్యాన్స్ అదే ఆలోచనల్లో ఉన్నారు. వీలైనంత త్వరగా మన బౌలర్లు హెడ్ ని అవుట్ చేస్తే సగం భారం దిగిపోయినట్లే.