ఇన్‌కమ్ ట్యాక్స్‌ (Income Tax)కు సంబంధించిన ప్రతి సమాచారం ట్యాక్స్‌పేయర్‌కు చాలా కీలకంగా మారుతంది. మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద మీ ఇంటికి బ్యాంక్ లేదా ఇన్‌కం ట్యాక్స్‌కు సంబంధించిన నోటీసులు వస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఇబ్బందికర పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? ఇదే విషయంపై అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ.. ఒకవేళ ఏ వ్యక్తి అయినా చనిపోతే వారి పేరు మీద ఇన్‌కం ట్యాక్స్ రీ అసెస్మెంట్ నోటీసు జారీ చేయడానికి వీల్లేదని తెలిపింది.

అసలు వివాదం ఏంటీ..

వాస్తవానికి, ఒక వ్యక్తికి ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మార్చి 2025లో రీ-అసెస్మెంట్ నోటీసు పంపించారు. కాగా ఆ వ్యక్తి జనవరి 2024లోనే చనిపోయారు. ఈ వ్యవహారం లక్నోలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి సంబంధించినదని తెలుస్తోంది. దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని డబ్బులు చెల్లించారని, కానీ అందుకు సంబంధించిన లెక్కలు చూపలేదని అనుమానం వ్యక్తం చేసింది. తరువాత ఆ వ్యక్తి మరణించిన విషయం డిపార్ట్‌మెంట్‌కు తెలియడంతో ఆయన భార్యకు ట్యాక్స్ నోటీసులు పంపుతూ చర్యలు తీసుకెళ్లారు. అలహాబాద్ హైకోర్టుకు ఈ వ్యవహారం కోర్టుకు చేరగా విచారణ సందర్భంగా తీ2ర్పును వెలువరించింది.

ఈ వ్యవహారంపై కోర్టు ఏం చెప్పింది?

ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఆయన పేరు మీద ఇన్‌కమ్ ట్యాక్స్ రీ-అసెస్మెంట్ నోటీసు జారీ చేయడం చట్టపరంగా తప్పు అని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత ట్యాక్స్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలంటే, ఆ నోటీసు చట్టపరంగా వారసుడి (Legal Heir) పేరు మీద జారీ కావాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు, వ్యక్తి జీవించి ఉన్నప్పుడే చర్యలు ప్రారంభమై ఉంటే, దాన్ని వారసుడి పేరు మీద ముందుకు తీసుకెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

మీకు ఇలాంటి నోటీసు వస్తే ఏం చేయాలి?

ఒకవేళ మీ ఇంట్లో మరణించిన వ్యక్తి పేరు మీద ఇన్‌కం ట్యాక్స్ నోటీసు వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు.

అందు కోసం ముందుగా మీరు డిపార్ట్‌మెంట్‌కు మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) వివరాలను అందించాలి.

అవసరమైతే మీరు ట్యాక్స్ లాయర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) నుంచి ముఖ్యమైన సలహాలు తీసుకోవాలి.

ఇటీవల ఇళ్లలో ఎవరైనా చనిపోయిన వారికి ఈ సమాచారం చాలా అవసరం.

మరణించిన వ్యక్తి ట్యాక్స్ సంబంధిత వ్యవహారాలను చూస్తున్న వారు లాయర్ ద్వారా విషయాలు క్లారిఫై చేసుకోవాలి. పెండింగ్ ఉన్న నోటీసులకు సమాధానం ఇవ్వాలి.