Important Days in Jan : నేషనల్ హాట్ చాక్లెట్ డే ఎప్పుడో తెలుసా? ఆల్కహాల్‌తో చేసిన కాఫీ రోజు ఏరోజు చేసుకుంటారో ఐడియా ఉందా?

10 months ago 8
ARTICLE AD

Important Days in January 2025: ఇటీవలే 2024 కు గుడ్ బై చెప్పి 2025కి వెల్కమ్ చెప్పాం. కొత్త ఏడాదిలో ఒక నెల కూడా అయిపోవస్తోంది. చాలా మంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకోవడం ఈ మధ్య మొదలైన ఆచారమేం కాదు. ఇప్పటికే చాలా మంది చాలా పనులు మొదలు పెట్టేశారు. ఇంకా మొదలు పెట్టాలా వద్దా అనుకున్నటైంలోనే కొత్త సంవత్సరంలో ఒక ఏడాది గడిచిపోయింది. ఈ నెల పూర్తి అవ్వడానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉన్నాయి. అయినా ఇంకా ఏదైనా మొదలు పెట్టాలంటే మాత్రం ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఇందులో ఎన్ని సెలవులున్నాయో... ఇంకా చిత్రవిచిత్రమైన దినోత్సవాలు ఏం ఉన్నాయో ఒక్కసారి చూడండి.

జనవరి 24

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున, బాలికల హక్కులు, వారి ఆరోగ్యం, విద్య, సామాజిక స్థితిగతులపై అవగాహన కల్పిస్తారు.

జనవరి 25

నేషనల్ ఐరిష్ కాఫీ డేను ప్రతి సంవత్సరం జనవరి 25 న జరుపుకుంటారు. ఇది ప్రసిద్ధ ఆల్కహాల్ తో చేసిన కాఫీ.

జనవరి 26

భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిన కారణంగా జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. కాలక్రమేణా భారత్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

Also Read: 76వ గణతంత్ర దినోత్సవం - త్రివిధ దళాల ఉమ్మడి ప్రదర్శన - చరిత్రలో ఇదే తొలిసారి

జనవరి 29

ఈ రోజును లూనార్ న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం జనవరి 29న వస్తుంది. ముఖ్యంగా చైనా, కొరియా, వియత్నాం, ఇతర ఆగ్నేయాసియా దేశాల ప్రజలు ఈ రోజును జరుపుకుంటారు.

జనవరి 30

భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.

జనవరి 31

నేషనల్ హాట్ చాక్లెట్ డేను ప్రతి సంవత్సరం జనవరి 31 న జరుపుకుంటారు.

Also Read : Republic Day 2025 : గణతంత్ర దినోత్సవం Vs స్వాతంత్య్ర దినోత్సవం - ఈ రెండు రోజుల్లో జెండా ఎగురవేయడంలో ఉన్న తేడా ఇదే..!

Read Entire Article