Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లికి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పది లక్షలు ఇస్తారు. ఈ పది లక్షలు తీసుకో నేను చెప్పినట్లు చేయ్‌ అన్నీ తిరిగి వస్తాయ్‌ అని భాగ్యం వల్లి చేతిలో డబ్బు పెడుతుంది. వల్లి కోపంగా డబ్బు పడేసి కన్నతల్లిని కొట్టాను అన్న చెడ్డ పేరు నాకు వద్దు అని అంటుంది.

భాగ్యం వల్లీని కూల్ చేస్తూ.. పది లక్షలు నీ భర్తకి ఇస్తేనే నీ కాపురం సెట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మనం అంత డబ్బు తీసుకురాలేం.. అంత రావాలి అంటే మన జీవితాల్లో ఓ అద్భుతం జరగాలి.. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండటానికి ఈ పదిలక్షలు ఇవ్వడం కంటే ఇంకేదైనా మార్గం ఉందా చెప్పు అని అడుగుతుంది. దానికి వల్లి నువ్వు చెప్పేది నిజమే కానీ పాపం అమూల్య చాలా మంచిదమ్మా.. అమాయకురాలు.. ఆ బండొడిని ప్రేమించమని రాయభారం చేయడం తప్పు కదమ్మా అంటుంది. వాడు ప్రేమించా అని మోసం చేస్తే తప్పు కానీ వాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు.. వాళ్ల పెళ్లితో రెండు కుటుంబాలు కలిసిపోతే మంచిదికదా అని మీ అత్త సంతోషానికి కారణం అయిన నిన్ను నెత్తిన పెట్టుకుంటారని చెప్పి వల్లిని ఆలోచనలో పెట్టేస్తారు. తన మాట వినమని చెప్పి పదిలక్షలు వల్లీ చేతిలో పెడతారు.

ప్రేమ జరిగింది తలచుకొని ఏడుస్తుంది. ధీరజ్ కూడా చాలా బాధ పడతుంటాడు. ఇద్దరూ చెరో వైపు తిరిగి బాధ పడుతుంటారు. ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళ్లి ఇన్ని రోజులు ఇంత బాధ పడ్డావ్.. నీలో నువ్వు నరకం పడ్డావ్ కానీ నాకు ఒక్కసారి కూడా నాతో నీబాధ చెప్పుకోవాలి అనిపించలేదా.. నువ్వు ఎందుకు బాధ పడుతున్నావో ఎంతమందికి అడిగానో తెలుసా నీ టెన్షన్ చూసి నరకం అనుభవించాను.. నువ్వు చెప్పకపోయినా తెలుసుకోవాలనే ఇందాక నీ చావు చావు అని చెప్పి వెళ్లిపోయినట్లు నటించి నిన్ను ఫాలో అయ్యాను. నేను ఒకవేళ రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి.. నాతో సహా నీ కోసం కొన్ని ప్రాణాలు బతుకుతున్నాయి. మా పరిస్థితి ఏంటి.. నువ్వు నా దానివి అనుకున్నా. కానీ నువ్వు నన్ను పరాయివాడిని చేసి పడేశావ్.. తిండి నిద్ర లేకుండా నువ్వు బాధ పడి నన్ను బాధ పెట్టేశావ్.. ఒక్క సారి కూడా నాకోసం ధీరజ్ ఉన్నాడు నాకు చెప్పాలి అనిపించలేదా అని ధీరజ్ అడుగుతాడు.

ప్రేమ ఏడుస్తూ ఎలారా నీకు చెప్పేది.. ఆరోజు నేను నీకు చెప్పడానికి వస్తే ఎన్ని మాటలు అన్నావో గుర్తు లేదా అని అంటుంది. నీ మెడలో తాళి కట్టకపోయి ఉంటే బాగుండేది అన్నావ్ మరి నువ్వు అలా అంటే నా కోసం ధీరజ్ ఉన్నాడు అనే భావన నాకు ఎలా వస్తుందిరా.. నాకు ఏదైనా కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వురా కానీ నువ్వే నన్ను ఓ కష్టంలా చూస్తే నాబాధ నీకు ఎలా చెప్పుకోవాలిరా అందుకే నా సమస్య నేను పరిష్కరించుకోవాలి అనుకున్నా.. నాకు ఎవరూ లేరు నేను ఒంటర్ని అని ఏడుస్తుంది. ధీరజ్ ప్రేమ చేయి పట్టుకొని నువ్వు ఒంటరివి కాదు ప్రేమ నీ కోసం నేను ఉన్నా అని అంటాడు. దానికి ప్రేమ నీ కోసం నేను ఉన్నానని నువ్వు అంటున్నావ్ కానీ నీ మనసులో నేను లేనురా అని ప్రేమ అనగానే ధీరజ్ ప్రేమ చేతులు వదిలేస్తాడు. ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోతుంది.

భాగ్యం, ఇడ్లీబాబాయ్‌లు శ్రీవల్లి సమక్షంలో చందుకి డబ్బులు ఇస్తారు. మోసపోయి ఆస్తులు పోగొట్టుకున్నాం తప్ప మేం ఎవరినీ మోసం చేయలేదు అని అంటారు. మేం మీకు డబ్బులు ఇవ్వడం లేటు అవ్వడం వల్ల మీరు అమ్మాయి మీద కోప్పడ్డారు. మా అమ్మడుకి మీరంటే చచ్చేంత ప్రేమ మీరు ఒక్క మాట అన్నా తట్టుకోలేరు. అలాంటిది మీరు తనతో మాట్లాడకపోయే సరికి తట్టుకోలేకపోయింది అని భాగ్యం వాళ్లు సారీ చెప్తారు. తల తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం మా అమ్మాయిని బాగా చూసుకోండి అంటారు. ఏదో టెన్షన్‌లో అనేశా కానీ వల్లీ అంటే నాకు ప్రాణం అని చందు అనగానే వల్లీ భర్తని హగ్ చేసుకొని ఐలవ్‌యూ బా అని అంటుంది. చందు డబ్బు తీసుకొని ముందు ధీరజ్ లక్ష ఇచ్చేయాలి అనుకుంటాడు.

భాగ్యం, ఆనంద్‌రావులు వల్లీని బయటకు తీసుకెళ్లి భద్రావతి, విశ్వాలకు చూపిస్తుంది. వాళ్లని చూసి వీళ్లు నవ్వుతారు. ఎవరూ చూడకుండా వల్లీ చేయి ఊపుతుంది. వాళ్లతో ఓకే అని చెప్పేస్తుంది. తేడా ఏం రాదు కదా అని వల్లీ అంటే వస్తే నేను శకునిలా చూసుకుంటాలే అంటుంది. అమూల్య అక్కడే చదువుకుంటూ ఉంటే విశ్వ వాళ్లు చూస్తారు. వల్లీ వాళ్లు కూడా చూస్తారు. అమూల్య వల్లిని చూసి హాయ్ వదినా అంటుంది. మేనత్త,మేనల్లుడు తమ గేమ్ మొదలైందని సంబర పడిపోతారు. మరోవైపు నర్మదకి ప్రమోషన్ వచ్చిందని సాగర్ వచ్చి మల్లెపూలు గిఫ్ట్ అని ఇస్తాడు. సందర్భం ఏదైనా మెల్లెపూలు తప్ప ఇంకేం అయిడా రాదా నీకు అని నర్మద అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.